India vs Australia, 2nd ODI: నాగ్‌పూర్ వన్డేలో బద్దలయ్యే రికార్డులివే!

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది.
టర్నర్, బెహెండ్రాఫ్ స్థానాల్లో షాన్ మార్ష్, నాథన్ లయన్‌లు తుది జట్టులో వచ్చారు. మరోవైపు భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలాంటి మార్పులు చేయలేదు. హైదరాబాద్ వేదికగా గత శనివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
దీంతో రెండో వన్డేలోనూ అదే జోరుని కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా పర్యాటక జట్టు మాత్రం ఈ మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తున్నారు. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇరు జట్ల నమోదైన రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే..

3-0:
నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. 2009లో ఇదే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 99 పరుగులు, 2013లో 6 వికెట్లు, 2017లో ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు గెలిచింది.

11-1:
2012 నుంచి విదర్భ వేదికగా జరిగిన 12 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో ఇప్పటి వరకూ చేధనకు దిగిన జట్టే 11 సార్లు గెలిచింది. వన్డేల్లో మాత్రం ముందు బ్యాటింగ్ చేసిన జట్టు 2/8 సార్లు మాత్రమే విజయం సాధించింది.

10 పరుగుల దూరంలో:
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్‌లో 2000 పరుగులు చేయడానికి 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఈ రికార్డుని జడేజా అందుకునే అవకాశం ఉంది.

ఒక్క సిక్స్ కొడితే:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరొక సిక్స్ కొడితే 350 సిక్సులు బాది రెండో భారత్ ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications