For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటిచేత్తో మనీష్‌ పాండే స్టన్నింగ్ క్యాచ్.. వార్నర్‌ ఔట్!!

India vs Australia 2nd ODI: Manish Pandey stunner helps India break Australian opening stand

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే అద్భుత ఫీల్డింగ్ చేసాడు. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుని వావ్ అనిపించాడు. భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే పాండే షాక్ ఇచ్చాడు. తొలి వన్డే సెంచరీ హీరో డేవిడ్ వార్నర్ (15) మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

పాండే స్టన్నింగ్ క్యాచ్:

పాండే స్టన్నింగ్ క్యాచ్:

షమీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ రెండో బంతికని వార్నర్ ఆఫ్‌ సైడ్‌కు హిట్‌ చేయగా.. మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పాండే అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. తలపై నుంచి వెళ్లిపోతున్న బంతిని పాండే మెరుపు వేగంతో ఎగిరి పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌కు స్టేడియంలో ప్రేక్షకులు ఒక్కసారిగా కేకలు వేయగా.. వార్నర్‌ మాత్రం షాక్‌కు గురయ్యాడు. ఫోర్‌ వెళుతుందనుకున్న ఆ షాట్‌ను పాండే క్యాచ్‌గా అందుకోవడంతో.. వార్నర్‌ కాసేపు అలానే ఉండిపోయాడు. వార్న‌ర్ 12 బంతుల్లో రెండు ఫోర్ల‌తో 15 ర‌న్స్ చేశాడు.

సూపర్ మ్యాన్ పాండే:

సూపర్ మ్యాన్ పాండే:

పాండే అద్భుత ఫీల్డింగ్ చేయడంతో పక్కనే ఉన్న రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్ అతన్ని ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ పాండేను ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుతం పాండే క్యాచ్‌కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెట్ అభిమానులు పాండేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'సూపర్ మ్యాన్' పంజాబ్ జట్టు పోస్ట్ చేసింది. 'వాట్ ఏ క్యాచ్ పాండే' అని ఓ అభిమాని ట్వీట్ చేసాడు.

ఫించ్ స్టంపౌట్:

ఫించ్ స్టంపౌట్:

ఆసీస్‌ స్కోరు 20 పరుగుల వద్ద వార్నర్‌ ఔట్‌ కావడంతో ఫస్ట్‌ డౌన్‌లో మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ అండతో స్మిత్ మొదటి నుంచే ధాటిగా ఆడుతున్నాడు. మొదట తడబడ్డ ఫించ్.. ఆ తర్వాత పుంజుకున్నాడు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 48 బంతులు ఎదుర్కొన్న ఫించ్ 3 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.

విజయానికి ఇంకా 215 పరుగులు:

విజయానికి ఇంకా 215 పరుగులు:

ఫించ్ పెవిలియన్ చేరినా.. స్మిత్ మాత్రం ధాటిగానే ఆడుతున్నాడు. స్మిత్‌కు మార్నస్ లబుషేన్ మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి 29 బంతుల్లో 39 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ 48, లబుషేన్ 17 పరుగులతో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 215 పరుగులు కావాలి.

Story first published: Friday, January 17, 2020, 19:57 [IST]
Other articles published on Jan 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+