
35 వన్డేల తర్వాత చోటు:
పేసర్ శార్దూల్ ఠాకూర్ బదులు నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో మనీష్ పాండే ఆడుతున్నాడు. పాండే 2018 సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ తర్వాత తొలిసారి వన్డే ఆడుతున్నాడు. పాండేకు 35 వన్డేల తర్వాత చోటు దక్కింది. 2018లో తన చివరి వన్డే తర్వాత మనీష్ 27 లిస్ట్-ఎ ఇన్నింగ్స్‌లు ఆడి.. 4 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేసాడు. 84.05 సగటుతో 1,429 పరుగులు చేశాడు.

23 వన్డేలు.. 440 పరుగులు:
మనీష్ పాండే ఇప్పటివరకు భారత్ తరఫున 23 వన్డేలు ఆడి 440 పరుగులు చేసాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 33 టీ20లలో 618 పరుగులు చేసాడు. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోర్ 79. అయితే పాండే ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.

మూడో స్థానంలో కోహ్లీ:
రాజ్‌కోట్ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ యథావిధిగా తన మూడో స్థానంలో వస్తున్నాడు. కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లలో నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఐదవ స్థానంలో రానున్నాడు. రాజ్‌కోట్ వన్డేకు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ముంబై వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. భారత్ ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలిచితీరాల్సిందే.

జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, నవదీప్ సైని, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కె), లబుషేన్, స్మిత్, టర్నర్, కేరీ, ఆగర్, కమిన్స్, స్టార్క్, రిచర్డ్‌సన్, జంపా.


Click it and Unblock the Notifications
