Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia, 2nd ODI: టీమిండియా రెండు మార్పులు, టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా

India vs Australia, 2nd ODI Live Score: Australia have won the toss and have opted to field

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. రాజ్‌కోట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫింట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫలితంగా టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో మనీష్ పాండే, నవదీప్ సైనీలకు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో మనీష్ పాండే 2018 తర్వాత భారత్ తరుపున వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు.

1
46131

చివరగా మనీష్ పాండే 2018 సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌లో వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ మధ్య కాలంలో అతడు 35 వన్డేలను మిస్సయ్యాడు. టాస్ అనంతరం పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంద‌ని, త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేద‌ని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆర‌న్ ఫించ్ తెలిపాడు.

మరోవైపు కోహ్లీ మాట్లాడుతూ మేం టాస్ గెలిచినా, ముందు బౌలింగ్ ఎంచుకునే వాళ్ల‌మ‌ని చెప్పాడు. గాయపడిన పంత్ స్థానంలో మ‌నీష్ పాండేని తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మూడు వన్డేల సిరిస్‌లో ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలకు బ్రేకిచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానుండగా... ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ మ్యాచ్ ప్రారంభించారు. దీంతో తొలి వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్‌ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

మరోవైపు రెట్టింపు ఉత్సాహంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో గెలిచిన జోరును పునరావృతం చేసి ఈ మ్యాచ్‌లోనే సిరీస్‌ను పట్టేయాలని ఊవిళ్లూరుతోంది. భారత్‌లో భారత్‌పై వరుసగా రెండో వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించాలని గట్టి పట్టుదలతో ఉంది.

జట్ల వివరాలు:

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ (కె), కేఎల్‌ రాహుల్‌ (వి), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కె), లబుషేన్‌, స్మిత్‌, టర్నర్‌, కేరీ, ఆగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, జంపా

Story first published: Friday, January 17, 2020, 13:36 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+