నాగ్‌పూర్‌లో రెండో వన్డే: టాస్ నెగ్గిన ఆసీస్, కోహ్లీసేన బ్యాటింగ్

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది.
టర్నర్, బెహెండ్రాఫ్ స్థానాల్లో షాన్ మార్ష్, నాథన్ లయన్‌లు తుది జట్టులో వచ్చారు. మరోవైపు భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎలాంటి మార్పులు చేయలేదు. హైదరాబాద్ వేదికగా గత శనివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రెండో వన్డేలోనూ అదే జోరు
దీంతో రెండో వన్డేలోనూ అదే జోరుని కొనసాగించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా పర్యాటక జట్టు మాత్రం ఈ మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తున్నారు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌నే విజయం వరించింది. 2009లో 99 పరుగులు, 2013లో 6 వికెట్లు, 2017లో ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు గెలిచింది.
జట్ల వివరాలు:
భారత జట్టు:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు:
ఉస్మాన్ ఖవాజా, అరోన్ ఫించ్, షాన్ మార్ష్, మార్కస్ స్టాయినీస్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, అలెక్స్ కేరీ, కౌల్టర్ నైల్, కమిన్స్, లైయన్, జంపా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications