సెంచరీ మిస్: కోహ్లీ 90ల్లో అవుటవ్వడం ఎన్నోసారో తెలుసా?
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మరో ఎనిమిది పరుగులు చేసి ఉంటే కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేరి ఉండేది. అయితే ఇప్పటి వరకు తన కెరీర్‌లో 195 వన్డేలాడిన కోహ్లీ 90ల్లో అవుటవ్వడం ఇది ఐదోసారి.
ఈ వన్డేలో గనుక కోహ్లీ సెంచరీ చేసి ఉంటే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించేవాడు. అయితే దానిని కేవలం 8 పరుగుల దూరంతో కోల్పోయాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 30 సెంచరీలతో రికీ పాంటింగ్‌తో సమానంగా ఉన్నాడు.

రెండో ఆటగాడిగా నిలిచేవాడు
ఈ వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించి ఉంటే పాంటింగ్‌ని దాటేసి వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచేవాడు. ఇదిలా ఉంటే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

37వ ఓవర్లో నైల్ వేసిన బంతికి బౌల్డ్
కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇన్నింగ్స్ 37వ ఓవర్లో నైల్ వేసిన బంతికి బౌల్డయ్యాడు. ఇక, ఈ ఏడాది 23 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 1092 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 187 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 8,587 పరుగులు సాధించాడు.

వన్డేల్లో కోహ్లీ (90-99) పరుగుల మధ్యలో అవుటైన సందర్భాలు:
* 91 v Bangladesh, Dhaka, 2010
* 94 v West Indies, Kingston, 2011
* 99 v West Indies, Visakhapatnam, 2013
* 91 v Australia, Perth, 2016
* 92 v Australia, Kolkata, 2017*

45వ హాఫ్ సెంచరీ
తొలి వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ... రెండో వన్డేలో మాత్రం అభిమానులను అలరించాడు. తొలుత క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన కోహ్లీ అనంతరం దూకుడుగా ఆడుతూ 60 బంతుల్లో కెరీర్‌లో 45వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications