చెలరేగిన బౌలర్లు.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం.. సిరీస్ 1-1తో సమం

రాజ్‌కోట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 341 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్ అత్యధికంగా 98 పరుగులు చేసాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో సిరీస్ ఫలితం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి షిప్ట్ అయింది.

ఆదిలోనే షాక్:
భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (15) మహ్మద్ షమీ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆసీస్ స్కోరు 20 పరుగుల వద్ద వార్నర్ ఔట్ కావడంతో ఫస్ట్ డౌన్‌లో స్మిత్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఫించ్ అండతో స్మిత్ మొదటి నుంచే ధాటిగా ఆడాడు. మొదటగా తడబడ్డ ఫించ్.. ఆ తర్వాత పుంజుకున్నాడు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 48 బంతులు ఎదుర్కొన్న ఫించ్ 3 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.

స్మిత్ హాఫ్ సెంచరీ:
ఫించ్ పెవిలియన్ చేరినా.. స్మిత్ మాత్రం ధాటిగానే ఆడాడు. స్మిత్‌కు మార్నస్ లబుషేన్ మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్మిత్ హాఫ్ సెంచరీ చేసాడు. స్మిత్-లబుషేన్ జోడి 96 పరుగుల భాగస్వామ్యం అందించింది. అయితే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లబుషేన్ (46) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. ఒకవైపు స్మిత్ పోరాడుతున్నా.. మరోవైపు అతనికి సహకరించేవారు కరువయ్యారు.

షమీ, కుల్దీప్ విజృంభణ:
స్మిత్, లబుషేన్‌లు క్రీజులో ఉన్నంత సేపూ వికెట్ల కోసం చెమటోడ్చిన భారత బౌలర్లు ఆ తర్వాత విజృంభించారు. 38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. జోరుమీదున్న స్మిత్ (98)ను సెంచరీ ముంగిట బౌల్డ్ చేసి ఆసీస్‌కు భారీ ఝలకిచ్చాడు. ఆ తర్వాత 44వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనూ రెండు వికెట్లు తీసిన షమీ.. ఆసీస్ విజయావకాశాలను దెబ్బతీసి భారత్‌కు విజయాన్ని చేరువ చేశాడు. ఇక నవదీప్ సైనీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత విజయాన్ని ఖాయం చేసాడు. ఇక చివరి ఓవర్లో బుమ్రా జంపాను ఔట్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు.. జడేజా, కుల్దీప్,సైనీలు తలా 2 వికెట్లు తీశారు.

రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (42), విరాట్ కోహ్లీ (78) పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ (96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి వచ్చిన లోకేశ్ రాహుల్ 52 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 80 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జంపా వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications