India vs Australia: 727 పరుగులు.. ఆస్ట్రేలియా గడ్డపై ఇదే తొలిసారి!!

సిడ్నీ: ఆసీస్ గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు ముగిశాయి. రెండు వన్డేల్లో పరుగుల వరద పారింది. తొలి వన్డేలో ఇరు జట్లు కలిపి 682 పరుగులు చేస్తే.. రెండో వన్డేల్లో 727 పరుగులు సాధించాయి. రెండో వన్డేలో ఆస్ట్రేలియా 389 పరుగులు చేస్తే.. టీమిండియా 338 పరుగులు చేసింది. ఆసీస్ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో ఏడు వందలకు పైగా పరుగులు రావడం ఇదే మొదటిసారి. 2015 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 688 పరుగులు సాధించాయి. ఇప్పటివరకూ ఆసీస్‌లో ఇదే అత్యుత్తమ రికార్డు కాగా.. తాజాగా ఆ రికార్డును భారత్-ఆస్ట్రేలియా జట్లు బ్రేక్ చేశాయి.

అత్యధిక సిక్స్‌లు:
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఇరు జట్లు తలో 10 సిక్స్‌లు సాధించాయి. మొత్తంగా 20 సిక్స్‌లు నమోదయ్యాయి. ఫలితంగా ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేల పరంగా చూస్తే.. ఒక వన్డేలో అత్యధిక సిక్స్‌లు వచ్చిన జాబితాలో ఇది రెండో అత్యుత్తమంగా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 22 సిక్స్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిచింది.

విరాట్ 2020:
ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ఆసీస్‌పై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. ఆసీస్‌పై ఇప్పటివరకూ కోహ్లీ సాధించిన పరుగులు 2020. మరోవైపు కోహ్లీ 22 వేల అంతర్జాతీయ పరుగుల్ని కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. 22వేల పరుగుల మైలురాయిని చేరాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (462 ) ఈ ఫీట్ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ 493 ఇన్నింగ్స్‌ల్లో 22వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు.

కోహ్లీ@250:
ఆదివారం మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. భారత్ తరఫున 250 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరఫున 250 వన్డేలు ఆడిన 9వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (463) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (347 వన్డేలు), రాహుల్ ద్రవిడ్ (340), మహ్మద్ అజారుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (308), యువరాజ్ సింగ్ (301), అనిల్ కుంబ్లే (269)లు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే.. మహేలా జయవర్ధనే (448 వన్డేలు), సనత్ జయసూర్య (445), కుమార సంగక్కర (404), షాహిద్ అఫ్రిది (398), ఇంజామామ్-ఉల్-హక్ (378), రికీ పాంటింగ్ (375)లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
జడేజా లాంటి క్రికెటర్లతోనే నాకు సమస్య.. మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications