Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ: అభిమానుల నిరాశ

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మరో ఎనిమిది పరుగులు చేసి ఉంటే కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేరి ఉండేది. తృటిలో కోహ్లీ సెంచరీ చేజార్చుకోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

రోహిత్ శర్మ అవుటైన క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. కౌల్టర్ నైల్ బంతికి కోహ్లీ బౌల్డయ్యాడు. 107 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో కోహ్లీ 92 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో తన కెరీర్‌‌లో 31వ సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో చేజార్చుకున్నాడు.

 India vs Australia, 2nd ODI at Kolkata: Virat Kohli miss century

వన్డేల్లో కోహ్లీ (90-99) పరుగుల మధ్యలో అవుటైన సందర్భాలు:
* 91 v Bangladesh, Dhaka, 2010
* 94 v West Indies, Kingston, 2011
* 99 v West Indies, Visakhapatnam, 2013
* 91 v Australia, Perth, 2016
* 92 v Australia, Kolkata, 2017 *

తొలి వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ... రెండో వన్డేలో మాత్రం అభిమానులను అలరించాడు. తొలుత క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన కోహ్లీ అనంతరం దూకుడుగా ఆడుతూ 60 బంతుల్లో కెరీర్‌లో 45వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+