Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీలో క్వారంటైన్‌.. భారత్-ఆస్ట్రేలియా షెడ్యూల్ ఇదే!!

India vs Australia 2020 Tour Schedule Announced

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 అనంతరం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయితే క్రిక్‌ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం..భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 1న తొలి వన్డే జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్వారంటైన్, శిక్షణ సదుపాయాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

తొలుత బ్రిస్బేన్‌ను ఎంపిక చేసినా.. 14 రోజుల క్వారంటైన్‌ సమయంలో ట్రైనింగ్‌ చేసుకునేందుకు క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర వైద్య అధికారులు అంగీకరించలేదు. దీంతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సిడ్నీ, కాన్‌బెర్రా ఆతిథ్యమిచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో (మూడు టీ20లు, మూడు వన్డేలు) సిడ్నీలో నాలుగు, కాన్‌బెర్రాలో రెండు జరుగనున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు ఇరు జట్లకు ట్రైనింగ్‌తో కూడిన క్వారంటైన్‌ కోసం సీఏ నుంచి తమకు అభ్యర్థన అందిందని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్ర క్రీడామంత్రి స్టువర్ట్‌ ఎరేస్‌ కూడా చెప్పారు.

నవంబర్ 1న తొలి వన్డే జరగనుండగా.. డిసెంబర్ 8న మూడో టీ20 జరగనుందని సమాచారం. తొలి టెస్టు మ్యాచ్‌ను పింక్ బాల్ (డే అండ్ టెస్ట్)తో నిర్వహిస్తారు. డిసెంబర్ 17న అడిలైడ్ ఓవల్‌లో ఈ డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం అవుతుంది. బాకింగ్స్ డే టెస్టుకు బ్యాకప్ వేదికగానూ అడిలైడ్ ఓవల్‌ను సిద్ధంగా ఉంచారు. కరోనా ఆంక్షల కారణంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్టును నిర్వహించకపోతే.. అడిలైడ్‌లో నిర్వహిస్తారు. ఐపీఎల్ 2020 అనంతరం భారత ఆటగాళ్లు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా చేరుకుంటారు.

షెడ్యూల్:
తొలి వన్డే: నవంబర్ 27 (ఎస్‌సీజీ)

రెండో వన్డే: నవంబర్ 29 (ఎస్‌సీజీ)

మూడో వన్డే: డిసెంబర్ 1 (ఓవల్)

తొలి టీ20: డిసెంబర్ 4 (ఓవల్)

రెండో టీ20: డిసెంబర్ 6 (ఎస్‌సీజీ)

మూడో టీ20: డిసెంబర్ 8 (ఎస్‌సీజీ)

తొలి టెస్టు: డిసెంబర్ 17-21 (అడిలైడ్)

రెండో టెస్టు: డిసెంబర్ 26-31 (ఎంసీజీ)

మూడో టెస్టు: జనవరి 7-11 (ఎస్‌సీజీ)

నాలుగో టెస్టు: జనవరి 15-19 (బ్రిస్బేన్)

Story first published: Thursday, October 22, 2020, 20:03 [IST]
Other articles published on Oct 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+