India vs Australia 2020 1st ODI: కోహ్లీ సేన బోణీ కొట్టెనా? తొలి పోరుకు తుది జట్లు ఇవే!

సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు తమ తొలి పోరుకు సిద్దమైంది. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడనుంది. సిడ్నీ మైదానం వేదికగా.. 50 శాతం ప్రేక్షకుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారత జట్టు.. అన్ని విధాల సిద్దమైంది. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2018-19 పర్యటనలో 2-1తో వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ అదే జోరు కనబర్చాలని, విజయంతో టూర్ ప్రారంభించాలని భావిస్తోంది. మరోవైపు గత సీజన్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది.

రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం భారత్‌కు ప్రతికూలం కాగా.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియా బలాన్ని మరింత పెంచింది. ఇరు జట్లలోని ఆటగాళ్లకు ఐపీఎల్ 2020 సీజన్ ఫుల్ ప్రాక్టీస్ లభించింది. బలం, బలగం.. తెగింపు, తెగువ.. సమాన స్థాయిలో ఉండే ఈ రెండు జట్ల పోరాటంలో ఈసారి పైచేయి ఎవరిదో? మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో కంగారు పెట్టేదెవరో?

ఓపెనర్‌గా మయాంక్..

ఓపెనర్‌గా మయాంక్..

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో పరిమిత ఓవర్లకు సిరీస్‌కు దూరమవడంతో శిఖర్ ధావన్‌కు జతగా మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. వికెట్ కీపింగ్ చేయనున్న కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మూడు, నాలుగు స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయంతో చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా ఆడుతాడనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే అతను ఐపీఎల్‌లో బౌలింగ్ చేయలేదు. కానీ బ్యాటింగ్‌లో చెలరేగాడు. పైగా భారత్‌కు బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి.ఇక రొటేషన్ పద్దతిలో బుమ్రా, షమీ వర్క్‌లోడ్‌ను తగ్గిస్తామన్న బీసీసీఐ.. ఫస్ట్ మ్యాచ్‌కు ఈ సాహసం చేయకపోవచ్చు. ఈ స్టార్ పేసర్లు ఇద్దరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది. లోయారార్డర్‌ బ్యాటింగ్ బలంగా ఉండాలనుకుంటే ఠాకుర్‌ను తీసుకోవచ్చు.

స్మిత్, వార్నర్ రెడీ..

స్మిత్, వార్నర్ రెడీ..

గత ఆసీస్ పర్యటనకు ఈ సారి సమరానికి ప్రధాన తేడా స్మిత్, వార్నరే. ఏడాది నిషేధం కారణంగా గత పర్యటనకు అందుబాటులో లేని ఈ ఇద్దరూ ఈ సారి సొంతగడ్డపై సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. వార్నర్, ఫించ్ ఓపెనింగ్ జోడీ శుభారంభం అందిస్తే.. మూడోస్థానంలో స్మిత్ దానిని కొనసాగించగలడు. 2019లో టెస్ట్ క్రికెట్‌లో పలు ఘనతలు అందుకున్న లబుషేన్ నాలుగో స్థానంలో కీలకం కానున్నాడు. ఇక ఐపీఎల్‌లో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన మార్కస్ స్టోయినిస్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఐదు, ఆరో స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ దారుణంగా విఫలమైన మ్యాక్స్ వెల్‌ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్‌లతో బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగానే ఉంది.

 పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ మైదానంలో చివరిసారిగా జరిగిన ఏడు వన్డేల్లో ఆరు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాన్నందుకున్నాయి. సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 312. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే ఈ మైదానంలో భారత్‌కు గొప్ప రికార్డు లేదు. 16 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. విరాట్ కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. భారత కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది.

 తుది జట్లు:

తుది జట్లు:

భారత్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకుర్/నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ(కీపర్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్ వుడ్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, November 26, 2020, 17:06 [IST]
Other articles published on Nov 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X