రాహుల్, పంత్‌లకు చోటు: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు టీమిండియా ఎంపిక


హైదరాబాద్: ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న సుదీర్ఘ సిరిస్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు టీమిండియా జట్టుకు ప్రకటించారు.
న్యూజిలాండ్ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బుమ్రా ఈ మ్యాచ్‌లకు తిరిగి జట్టులో చేరారు. దీంతో విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారని తొలుత భావించారు.
'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిషేధానికు గురై న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్‌కి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును దాదాపు ప్రకటించారు. అయితే, కివీస్‌తో ఆడిన దినేశ్ కార్తిక్‌కు మాత్రం ఈ జట్టులో చోటు లభించలేదు.
ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శ చేసిన పేసర్ జయదేవ్ ఉనాద్కట్‌కు చోటు దక్కుతుందని భావించినప్పటికీ అతడికి నిరాశే ఎదురైంది. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా తొలి టీ20 ఫిబ్రవరి 24న జరగనుంది. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది.

ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, యజ్వేంద్ర చహల్, బూమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మయాంక్ మార్కండే

ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు టీమిండియా:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, బూమ్రా, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్ధార్ద్ కౌల్, కేఎల్ రాహుల్

మిగతా వన్డేలకు:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications