భారత్‌కు 500వ విజయం: రెండో వన్డేలో నమోదైన గణాంకాలివే


హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయ సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో టీమిండియాకు ఈ విజయం 500వది కావడం విశేషం. ఫలితంగా వన్డేల్లో 500 విజయాలను నమోదు చేసిన రెండో జట్టుగా భారత జట్టు అరుదైన ఘనత సాధించింది.
ఈ జాబితాలో 558 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 479 విజయాలతో పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 1975 జూన్ 11న వెంకటరాఘవన్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు తొలి వన్డే విజయాన్ని నమోదు చేసింది. 1975 వరల్డ్ కప్‌లో ఆడిన భారత్ పది వికెట్ల తేడాతో ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది.
వన్డేల్లో పది వికెట్ల తేడాతో ఓ జట్టు గెలవడం అదే తొలిసారి. 1974 జూలై 13న భారత్ ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. అయితే, టీమిండియా సాధించిన 300వ, 400వ, 500వ వన్డే విజయాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భాగస్వామిగా ఉన్నాడు.
రెండో వన్డేలో నమోదైన గణాంకాలివే:

100వ విజయానికి కెప్టెన్‌గా అజహరుద్దీన్
- 1993లో మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది భారత్‌కు 100వ విజయం. ఆ జట్టుకు కెప్టెన్‌గా అజహరుద్దీన్ ఉన్నాడు.
- 2000 సంవత్సరంలో నైరోబీలో కెన్యాపై గంగూలీ నాయకత్వంలోని టీమిండియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది వన్డేల్లో భారత్‌కు 200వ విజయం.
- 2007లో టీమిండియా 300వ విజయాన్ని నమోదు చేసింది. కటక్ వేదికగా విండీస్‌తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు.
- వన్డేల్లో 400వ విజయాన్ని టీమిండియా శ్రీలంకపై సాధించింది. 2012లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నాయకత్వంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 128 పరుగులు చేశాడు. అప్పటికీ 89 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీకి 13వ సెంచరీ.
- ధోనీ కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్లలోనూ అద్భుత విజయాలను నమోదు చేసింది. గత ఐదేళ్లలోనే టీమిండియా వంద వన్డే విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 300, 400, 500 వన్డే విజయాలు సాధించిన భారత జట్టులోని ఏకైక ఆటగాడు ధోనీనే కావడం విశేషం.
- విరాట్ కోహ్లీ సెంచరీలు చేసిన 33 వన్డేల్లో భారత్ విజయం సాధించింది. సచిన్ కూడా 33సార్లు సెంచరీలు చేసి భారత్‌ను గెలిపించాడు.
- ఈ మ్యాచ్‌లో కోహ్లీ(116) సెంచరీ సాధించడంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ పేరుపై ఉండేది. పాంటింగ్ 204 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.
- వన్డేల్లో కోహ్లీ చేసిన సెంచరీలు 40. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (49) రికార్డుకు విరాట్ కోహ్లీ ఇంకో తొమ్మిది సెంచరీల దూరంలో ఉన్నాడు.

ద్రవిడ్ కెప్టెన్సీలో 200వ విజయం

ధోనీ కెప్టెన్సీలో అద్భుత విజయాలు

మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా 9000 పరుగులు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications