కూర్చొని విమర్శలు గుప్పించడం సులువైన పనే: రవి శాస్త్రి


మెల్‌బోర్న్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టును తలపడిన టీమిండియా.. పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ కూడా విమర్శలకు గురైయ్యాడు. మైదానంలో కోహ్లీ ప్రవర్తనపై పలువురు కామెంట్లు చేస్తుంటే, రవిశాస్త్రి పిచ్ స్వభావం ప్రకారం జట్టు ఎంపిక సరిగా చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. వీరిలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు.

కచ్చితంగా కోచ్ వైఫల్యమేనంటూ విమర్శలు
లక్షల మైళ్ల దూరంలో కూర్చొని విమర్శలు గుప్పించడం చాలా సులువైన పనేనంటూ చెప్పుకొచ్చాడు. తనపై సునీల్ గవాస్కర్ సహా మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. పెర్త్ టెస్టులో భారత్ 146 పరుగుల భారీ తేడాడో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఎంపిక విధానం బాగోలేదని, అసలు పిచ్ స్వభావం సరిగ్గా గుర్తిస్తే జట్టులో ఎవరి సరిపోతారో ముందుగానే తెలిసేదని, ఇది కచ్చితంగా కోచ్ వైఫల్యమేనంటూ పలువురు విమర్శలు గుప్పించారు. వీటన్నిటితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి మరింత బాధ్యతను గవాస్కర్ డిమాండ్ చేశారు.

పేర్లు ప్రస్తావించకుండానే విసుర్లు
ఈ క్రమంలో శాస్త్రి ఎవరి పేర్లూ ప్రస్తావించకుండానే తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే జవాబులిచ్చారు. ‘లక్షల మైళ్ల దూరంలో కూర్చొని ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. దాని వల్ల ఏం ప్రయోజనం లేదు. వారి వ్యాఖ్యలు చాలా దూరంలో ఉండిపోయాయి. మేం దక్షిణ ధ్రువంలో ఉన్నాం. జట్టుకు ఏది ఉత్తమమో అదే చేయాలి. ఇది చాలా సాధారణ అంశం.

జడేజా విషయంలోనే పొరబాటు
జడేజా ఎంపికను మినహాయిస్తే మరెవరి విషయంలోనూ పొరబాటు జరగలేదు. మైదానంలో జడేజా, ఇషాంత్ శర్మ వాగ్వాదంపై ఇంత కవరేజీ వస్తుందని ఊహించా. ఇలాంటి విస్తృత కవరేజీని నేను ఇష్టపడతా. ఇవన్నీ జట్టు సభ్యుల్ని మరింత సన్నిహితం చేస్తాయి' అని రవిశాస్త్రి అన్నారు.

సఫారీ, ఇంగ్లాండ్‌ల వలె మూడో మ్యాచ్ గెలుస్తాం
‘విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన ఆటగాడు. అతడి ప్రవర్తనలో తప్పేముంది? మీరు ఎలా ప్రశ్నించినా.. మా దృష్టిలో అతడు మర్యాదస్తుడే. అలాగే మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. భారత్-ఏ తరఫున పరుగుల వరద పారించాడు. అతడి దేశవాళీ రికార్డులు, ప్రదర్శనలు చాలా బాగున్నాయి. అతడిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెర్త్ టెస్టు ఓటమి జట్టుపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. విదేశాల్లో ఇంతకు ముందు 1-1 పరిస్థితులు చూడలేదు. కుర్రాళ్లు రాణిస్తారనే అనుకుంటున్నాం. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో మాదిరిగా మూడో మ్యాచ్ గెలుస్తాం' అని రవిశాస్త్రి అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications