హైదరాబాద్: మైదానంలో చిరుతలా పరుగులుపెట్టే కెప్టెన్ కోహ్లీ అద్భుతరీతిలో ఫీల్డింగ్ చేసి, మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. శనివారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భువీ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టాడు.
అదే సమయంలో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, చాలా దూరం నుంచి దాని ఓ బుల్లెట్‌లా వికెట్లపైకి విసరగా, అది నేరుగా వచ్చి వికెట్లను తాకింది. దీంతో డాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. బంతికోసం వికెట్ల వెనుక చేతులు పెట్టి ఉన్న ధోని, బంతి డైరెక్టుగానే వికెట్లను తాకడంతో ఒక్క క్షణం ఆశ్చరపడ్డాడు.

ఆ వెంటనే కోహ్లీని అభినందించేందుకు ముందుకు కదిలాడు. బంతి నేరుగా వచ్చి వికెట్లను తాకిందని సైగ చేస్తూ ధోని కదిలిన వీడియోని బీసీసీఐ సోషల్ మీడిాయలో అభిమానులతో షేర్ చేసుకుంది. వరుణుడు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కోహ్లీ విసిరిన 'బుల్లెట్ థ్రో' వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో మీకోసం