హైదరాబాద్: సెప్టెంబర్ 12న జరిగే వార్మప్ మ్యాచ్‌తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే జరుగుతుందా? లేదా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో భారీ వర్షాలు పడుతుంటడమే.
అయితే భారీ వర్షాలకు ఈడెన్ మైదానం పాడయిందంటూ వస్తున్న వార్తల్ని ఖండించిన గంగూలీ, అందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్ని రోజులుగా వర్షం పడుతున్నా.. ఈడెన్ గార్డెన్ మైదానాన్ని పూర్తిస్థాయిలో సంరక్షిస్తున్నామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.
అంతేకాదు సెప్టెంబర్ 21వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు ఎటువంటి ఇబ్బంది ఉండదని గంగూలీ చెప్పాడు. 'వర్షం ఆగింది.. ఇప్పడంతా బాగుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానం మునుపటి రూపు రేఖల్ని ఏమీ కోల్పోలేదు. మ్యాచ్‌కు ఈడెన్ రెడీ అవుతుంది. రెండో వన్డే కోసం మేం పిచ్, మైదానాన్ని సిద్ధం చేయగలం' అని గంగూలీ అన్నాడు.

'గత కొద్ది రోజులుగా భారీ వర్షం పడుతున్న మాట వాస్తవమే. సీస్ తో ఫుల్ స్వింగ్ లో మ్యాచ్ జరుగుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నూతనుత్తేజంతో ఆసీస్ తో పోరుకు సిద్ధమవుతుంది. కానీ.. మైదానాన్ని చక్కగా కవర్లతో కప్పి ఉంచి సంరక్షిస్తున్నాం' అని గంగూలీ తెలిపాడు.
ఆసీస్ తన భారత పర్యటనలో ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20లు ఆడనుంది. సెప్టెంబర్ 17వ తేదీన ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే తొలి వన్డేతో సుదీర్ఘ సిరీస్ ఆరంభం కానుంది.