Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైలో చెమటోడ్చారు: ప్రాక్టీస్‌లో స్మిత్ సేన బిజీ (ఫోటోలు)

హైదరాబాద్: నాలుగు టెస్టుల మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. ఫిబ్రవరి 13 (సోమవారం)న భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండు రోజులకే టెస్టు సిరిస్ సన్నాహకాల్లో ముగిసిపోయారు.

ఫోటోలు: ప్రాక్టీస్‌లో స్మిత్ సేన బిజీ ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టు సభ్యులంతా పాల్గొన్నారు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఉస్మాన్‌ ఖవాజాలు నెట్స్‌లోని వేర్వేరు వికెట్‌లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్‌ క్యాచింగ్‌లో పాల్గొన్నారు.

ప్రాక్టీస్‌లో స్మిత్ సేన

ప్రాక్టీస్‌లో స్మిత్ సేన

ముఖ్యంగా స్థానిక స్పిన్‌ బౌలర్లతో పాటు జట్టు స్పిన్‌ కన్సల్టెంట్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లంతా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి సారించారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇండియా ఏతో ఆస్ట్రేలియా తలపడుతుంది.

ఫిబ్రవరి 23న పూణె వేదికగా తొలి టెస్టు

ఫిబ్రవరి 23న పూణె వేదికగా తొలి టెస్టు

ఆ తర్వాత ఫిబ్రవరి 23న పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చారు. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తారు. ఈ సిరీ‌స్‌లో స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలతో ఆసీస్‌కు ప్రధాన సవాల్‌ ఎదురుకానుంది.

సన్నద్ధంగా ఉన్నామని డేవిడ్ వార్నర్

సన్నద్ధంగా ఉన్నామని డేవిడ్ వార్నర్

ఇక, భారత్ టాప్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ‘ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ మనసును చదివి బౌలింగ్‌ చేసే అశ్విన్‌ లాంటి బౌలర్‌ను నేను గౌరవిస్తా. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం అవసరం. అశ్విన్‌ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగొచ్చు' అని వార్నర్‌ చెప్పాడు.

టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్

టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్

ఇదిలా ఉంటే ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు రెండో స్ధానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా చివరిసారిగా 2013లో భారత పర్యటనకు వచ్చి 4-0తో వైట్‌వాష్‌కు గురైంది. అప్పటి సిరిస్‌లో అశ్విన్‌ 29 వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+