
కోల్‌కతాలో 40డిగ్రీల ఉష్ణోగ్రత
అయితే బుధవారం సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టడంతో పాటు వాతావరణం చల్లగా ఉంది. అయితే ఉన్నట్టుండి గురువారం కోల్‌కతాలో 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు వర్షం తగ్గడంతో మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

ఆసీస్ క్రికెటర్లకు ఉక్కపోత
దీంతో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ఆసీస్ బౌలర్లు బంతులేయడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఫీల్డర్లు సైతం చెమటలు కక్కుతూ కనిపించారు. బ్రేక్ దొరికినప్పుడల్లా ఆసీస్ సిబ్బంది ఆటగాళ్ల కోసం ఐస్ బ్యాగులను తీసుకొచ్చి అందిస్తున్నారు. దీంతో వారు కాస్తంత ఉపశమనం పొందుతున్నారు.
రెండో వన్డేలో ఆసీస్ లక్ష్యం 253
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 253 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (92), అజింక్యా రహానే (55) పరుగులతో రాణించారు.
రాణించిన ఆసీస్ బౌలర్లు
మిగతా టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ (7) మనీష్ పాండే (3), కేదర్ జాదవ్ (24), హార్థిక్ పాండ్యా (20), భువనేశ్వర్ కుమార్ (20), కుల్దీప్ యావద్ (0), బుమ్రా (10), చాహల్ ఒక పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్, రిచర్డ్‌సన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా కమ్మిన్స్, అగర్ చెరో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications











