జడేజా 6 వికెట్లు: రివ్యూలో ఇద్దరు ఆసీస్ అటగాళ్లు అవుట్
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు సత్తా చాటారు. 237/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఆసీస్ మరో 39 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు ఆటలో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 118వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ మిచెల్ స్టార్క్‌ను పెవిలియన్‌కు పంపగా ఆ తర్వాత 121వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వేడ్, లియాన్‌లు వరుసగా పెవిలియన్‌కు చేరారు.

118వ ఓవర్‌లో స్టార్క్ అవుట్
రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా 118వ ఓవర్ వేసేందుకు రవిచంద్రన్ అశ్విన్ బంతిని అందుకున్నాడు. అశ్విన్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్టార్క్ బ్యాట్ అంచును తాకుతూ బంతి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. వెంటనే భారత ఆటగాళ్లు అవుట్‌గా అప్పీలు చేయడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.

7 వికెట్ల నష్టానికి ఆసీస్ 274
అయితే స్టార్క్ రివ్యూ కోరగా నాటౌట్‌గా తేలింది. అనంతరం అదే ఓవర్ చివరి బంతిని స్టార్క్ సిక్స్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద జడేజా బంతిని క్యాచ్‌పట్టాడు. దీంతో స్టార్క్ 26 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

ఎల్బీడబ్ల్యూగా వేడ్
అనంతరం 121వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన మొదటి బంతిని ఎదుర్కొన్న ఆసీస్ ఆటగాడు వేడ్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఈ మేరకు భారత ఆటగాళ్లు ఆప్పీల్ చేశారు. అంపైర్ అవుటిచ్చినా వేడ్ రివ్యూని ఆశ్రయించాడు. దీంతో
రివ్యూలో వేడ్ అవుటని తేలడంతో పెవిలియన్‌కు చేరాడు.

లియాన్ కూడా వేడ్ లాగే
వేడ్ అవుటైన తర్వాత లియాన్ క్రీజులోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చిన లియాన్‌ను జడేజా క్రీజులో కుదురుకోనివ్వలేదు. వెంటనే అతన్ని అవుట్ చేయడంతో లియాన్ సైతం రివ్యూని ఆశ్రయించాడు. దీంతో రివ్యూలో లియాన్ కూడా అవుటని తేలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో జడేజా 6, అశ్విన్ 2, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications