హైదరాబాద్: పూణెలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 94 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్ 57, జోష్ హాజిల్ ఉడ్ 1 పరుగుతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయిన ఆసీస్ రెండు, మూడు సెషన్లలో తడబడింది. ఓపెనర్ రెన్ షా 68 పరుగులతో కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. చివర్లో మిచెల్ స్టార్క్(58 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టంతో 84 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓవైపు స్పిన్నర్లు, మరోవైపు పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఆసీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. తొలి సెషన్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ రెన్షా మాత్రమే ఇండియా బౌలర్లను కాస్త సమర్థంగా ఎదుర్కొన్నాడు.
డేవిడ్ వార్నర్ (38), స్టీవ్ స్మిత్ (27) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, అశ్విన్, జడేజా చెరో 2 వికెట్లు, జయంత్ యాదవ్ తీసుకున్నారు. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్‌కి ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన.
తొలిరోజు ఆట సాగిందిలా:
205 పరుగుల వద్ద స్టీవ్ ఒకీఫ్ డకౌట్
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 205 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్టీవ్ ఒకీఫ్ డకౌట్ అవుడయ్యాడు. దీంతో 81.4 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. స్టీవ్ ఒకీఫ్ అవుటైన తర్వాత జోష్ హాజెల్‌వుడ్ క్రీజులోకి వచ్చాడు.
పూణె టెస్టులో కష్టాల్లో ఆస్ట్రేలియా
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. అశ్విన్ బౌలింగ్‌లో మ్యాట్ రెన్‌షా 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో 80 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 199 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా, ఉమేశ్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీసుకోగా జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది.
వేడ్ అవుట్: ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 190 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వేడ్ (8) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 76 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. వేడ్ అవుటైన తర్వాత క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. ప్రస్తుతం రెన్‌షా 64, స్టార్క్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించినప్పటికీ వరుస విరామాల్లో ప్రధాన వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ మార్ష్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 71 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం రెన్‌షా 53, వేడ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీ విరామానికి ఆస్ట్రేలియా 153/4
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తడబడుతోంది. టీ విరామానికి 63 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రెన్‌షా 38, మిచెల్ మార్ష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 22 పరుగులు చేసిన హ్యాండ్స్‌కోంబ్‌ను 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ స్మిత్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. ఈరోజు ఉదయం కడుపునొప్పితో రిటైర్డ్ హర్ట్ అయిన ఓపెనర్ రెన్‌షా తిరిగి క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆసీస్ 61 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
డ్రింక్స్ విరామం: 50 ఓవర్లకు ఆసీస్ 128/2
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. డ్రింక్స్ విరామం వచ్చింది. ప్రస్తుతం కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
షాన్ మార్ష్ అవుట్: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 119 పరుగుల వద్ద జయంత్ యాదవ్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ (16) పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 47 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. షాన్ మార్ష్ అవుటైన తర్వాత పీటర్ హ్యాండ్స్‌కోంబ్ క్రీజులోకి వచ్చాడు.
100 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఆస్ట్రేలియా 39 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ 11, షాన్ మార్ష్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.
లంచ్ విరామానికి ఆసీస్ 84/1
పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షాన్‌మార్ష్ 1, స్టీవెన్ స్మిత్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.
వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఉమేశ్ యాదవ్
పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 27 ఓవర్ల పాటు ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్ పడలేదు. దీంతో కెప్టెన్ కోహ్లీ 28 ఓవర్‌ను ఉమేశ్ యాదవ్‌కిచ్చాడు.
ఉమేశ్ యాదవ్ తన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం విశేషం. మరో ఓపెనర్ మ్యాట్ రెన్‌షా కూడా 36 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కడుపు నొప్పి రావడంతోనే రెన్‌షా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం క్రీజులో షాన్‌మార్ష్ 1, స్టీవెన్ స్మిత్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న ఆసీస్
పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 16, మ్యాట్ రెన్షా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పూణెలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్‌కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని టాస్ గెలిచిన అనంతరం స్టీవ్ స్మిత్ తెలిపాడు.
టీ20 మ్యాచ్‌లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ టెస్టు సిరీస్‌కు బాగా ప్రాక్టీస్ చేశామని చెప్పాడు. ఆసీస్ తరుపున ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎటువంటి అంచనాలు లేకుండానే టాస్‌కు వచ్చానని అన్నాడు.
తుది జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో జయంత్ యాదవ్‌ను తీసుకున్నట్టు కోహ్లీ వెల్లడించాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జయంత్, అశ్విన్, జడేశాలతో తమ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందని కోహ్లీ తెలిపాడు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేన్ స్టేడియం టెస్టు మ్యాచ్‌కు తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది.
పిచ్ పొడిగా ఉంది:
పూణె పిచ్ పొడిగా ఉంది. విరాట్ కోహ్లీ కూడా ఈ స్లో పిచ్ నుంచి స్పిన్ ఆశిస్తున్నట్టు చెప్పాడు. వాంఖడే స్టేడియం లాగే ఈ పిచ్‌పైనా పగుళ్లు కనిపిస్తున్నాయి. కాబట్టి రివర్స్ స్వింగ్‌కు కూడా అవకాశాలున్నాయి. ప్రస్తుతం పుణెలో వాతావరణం పొడిగా ఉంది.
జట్ల వివరాలు:
టీమిండియా: కేఎల్ రాహుల్, విజయ్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానె, సాహా (వికెట్‌కీపర్), అశ్విన్, జడేజా, జయంత్, ఇషాంత్, ఉమేష్ యాదవ్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, రెన్‌షా, స్మిత్ (కెప్టెన్), షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్ (వికెట్‌కీపర్), మిచెల్ స్టార్క్, స్టీవ్ ఒకీఫ్, నాథన్ లియాన్, హాజెల్‌వుడ్.