
హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవరీతిలో ఔటవడాన్ని టీమిండియా అభిమానులు ఓర్వలేకపోతున్నారు. పలుమార్లు విఫలమవుతున్నా... క్లాస్ ప్లేయర్ అని సెలక్టర్లు పదేపదే అవకాశాలు కల్పిస్తున్నా సద్వినియోగం చేసుకోలేక విఫలమవుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడిలైడ్ టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (2) పరుగులకే పెవిలియన్‌కు చేరడంపై సోషల్ మీడియా వేదికగా రాహుల్‌ను ఫ్యాన్స్ కడిగిపారేస్తున్నారు. నిజానికి ఈ టెస్టు సిరిస్‌కు ముందు విండిస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో కూడా రాహుల్ విఫలమయ్యాడు. దీంతో అతడికి జట్టులోకి తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా పెట్టారు.
అయినా.. జట్టు మేనేజ్‌మెంట్ అడిలైడ్ టెస్టులో రాహుల్‌కు ఓపెనర్‌గా అవకాశం కల్పించింది. దీంతో మరోసారి రాహుల్ విఫలం కావడంతో "రాహుల్ బ్యాటింగ్ చేయడానికి వచ్చావా? లేకుంటే ఫోటో షూట్ కోసం వచ్చావా?" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రెండో టెస్టుకైనా రాహుల్‌ను తప్పించాలని కోరుతున్నారు.
టెస్టు క్రికెట్‌కు కావాల్సిన కనీస టెక్నిక్ రాహుల్‌కు లేదని మండిపడుతున్నారు. రెండు ఓవర్లు కూడా ఆడని రాహుల్ నిజమైన క్రికెటరేనా అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.