తొలి టెస్టుపై పట్టు బిగిస్తోన్న భారత్: ఆధిక్యం 166, ఎలైట్ జాబితాలోకి కోహ్లీ

హైదరాబాద్: అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 151/3తో నిలిచింది. పుజారా(40), రహానే(1) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకోవడంతో ప్రస్తుతం భారత్ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 150 పరుగులు చేస్తే.. అడిలైడ్ టెస్టుపై భారత్ పట్టు బిగించే అవకాశం ఉంది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. కంగారూలకు సవాల్‌గా మారిన కోహ్లీ(34) ఆట ఆఖర్లో పెవిలియన్‌కు చేరాడు.
ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ ధీటుగా ఎదుర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే ఔటైన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులతో భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. దీంతో భారత్ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించింది.

తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించిన భారత్
రాహుల్‌కు సహకారం అందిస్తున్న మరో ఓపెనర్ మురళీ విజయ్(18)ను స్టార్క్ ఔట్ చేయడంతో 63 స్కోరు వద్ద భారత్ తొలి వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో రాహుల్(44) కూడా నిష్క్రమించడంతో భారత్ 76 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఈ దశలో పుజారా (127 బంతుల్లో 40 బ్యాటింగ్ ), కోహ్లీ (34) భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
50కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లీ-పుజారా
స్కోరు బోర్డుపై చేరే ప్రతి పరుగూ అత్యంత కీలకం అన్నట్లుగా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. బౌలర్లకు ఇబ్బందిగా మారిన ఈ జోడీ భారత్ ఆధిక్యాన్ని 150 దాటించారు. టెస్టు క్రికెట్లో పుజారా, కోహ్లీ పదకొండోసారి 50కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నెమ్మదిగా ఆడుతూ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఆచితూచి ఆడుతోన్న ఈ జోడీని నాథన్ లయాన్ విడదీశాడు.
నాథన్ లయాన్ బౌలింగ్‌లో ఔటైన కోహ్లీ
ఇన్నింగ్స్ 58వ ఓవర్లో లయాన్ వేసిన తొలి బంతిని డిఫెన్స్ ఆడగా బ్యాట్ అంచుకు తాకి గ్లోవ్స్‌తో పాటు ప్యాడ్లను తాకిన బంతిని షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆరోన్ ఫించ్ అందుకున్నాడు. దీంతో జట్టు స్కోరు 147 పరుగుల వద్ద టీమిండియా కోహ్లీ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారాకు తోడుగా రహానె క్రీజులోకి వచ్చాడు.
ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా భారత బ్యాటింగ్
చేతిలో ఇంకా వికెట్లు ఉండటంతో ఆతిథ్య ఆస్టేలియా జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ కోహ్లీని ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో కోహ్లీని ఎక్కువసార్లు పెవిలియన్‌కు చేర్చిన బౌలర్‌గా నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. లియాన్ కోహ్లీని ఆరుసార్లు ఔట్ చేయగా.. అండర్సర్, స్టువర్ట్ బ్రాడ్ ఐదేసి సార్లు ఔట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications