Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ Vs ఆస్ట్రేలియా: పూణె టెస్టులో తొలి రోజు నమోదైన రికార్డులివే

హైదరాబాద్: పూణెలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 94 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్ 57, జోష్ హాజిల్ ఉడ్ 1 పరుగుతో ఉన్నారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయింది. ఆ తర్వాత రెండు, మూడు సెషన్లలో భారత బౌలర్లు సత్తా చాటారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ రెన్ షా 68 పరుగులతో కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌‌కు చేరారు.

ఇక చివర్లో మిచెల్ స్టార్క్(58 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టంతో 84 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓవైపు స్పిన్నర్లు, మరోవైపు పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఆసీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు.

తొలి సెషన్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ రెన్షా మాత్రమే ఇండియా బౌలర్లను కాస్త సమర్థంగా ఎదుర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ (38), స్టీవ్ స్మిత్ (27) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌ 4, అశ్విన్, జడేజా చెరో 2 వికెట్లు, జయంత్ యాదవ్‌ తీసుకున్నారు. టీమిండియా బౌలర్ ఉమేశ్‌ యాదవ్‌కి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇదిలా ఉంటే పూణె టెస్టులో తొలి రోజు పలు రికార్డులు నమోదయ్యాయి.

తొలి రోజు నమోదైన రికార్డులు:

టెస్టుల్లో వంద 100 వికెట్లు తీసి 1000 పరుగులు

టెస్టుల్లో వంద 100 వికెట్లు తీసి 1000 పరుగులు

* టెస్టుల్లో వంద 100 వికెట్లు తీసి 1000 పరుగులు చేసిన 63వ ఆటగాడిగా, 14వ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు.

పదో వికెట్‌కు 50కి పైగా భాగస్వామ్యాలు

పదో వికెట్‌కు 50కి పైగా భాగస్వామ్యాలు

* ఆస్ట్రేలియా పదో వికెట్‌కు 50కి పైగా భాగస్వామ్యాలను నెలకొల్పడం ఇది మూడోసారి.

రికార్డు సృష్టించిన రెన్ షా

రికార్డు సృష్టించిన రెన్ షా

* ఆస్ట్రేలియా ఓపెనర్ రెన్ షా ఉపఖండంలో అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అతని వయసు 20 ఏళ్ల 332 రోజులు.

అంతక ముందు రిక్ డార్లింగ్

అంతక ముందు రిక్ డార్లింగ్

* 1979లో కాన్పూర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ రిక్ డార్లింగ్ అర్ధ సెంచరీ చేసినప్పుడు అతని వయసు 22 ఏళ్ల 156 రోజులు.

ఉమేశ్ యాదవ్‌కు భారత్‌లో అత్యుత్తమ ప్రదర్శన

ఉమేశ్ యాదవ్‌కు భారత్‌లో అత్యుత్తమ ప్రదర్శన

* 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్‌కు భారత్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2011లో వెస్టిండీస్‌పై 80 పరుగుల ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+