
ఓ అవకాశం ఉంది
ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా, శుభమన్ గిల్ అంచనాల్ని అందుకోలేకపోవడంతో కేఎల్ రాహుల్‌కి మళ్లీ ఓపెనర్‌గా అవకాశమివ్వాలని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా సూచించాడు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు. తొలి టెస్టులో రాహుల్ ఆడటం అనుమానమేనని జోస్యం చెప్పాడు. 'రాహుల్ మొదటి టెస్టుకు ఓపెనర్‌గా రావడానికి ఓ అవకాశం ఉంది. ఇప్పటి వరకూ రాహుల్ 36 టెస్టుల్లో 34.59 సగటుతో 2,006 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. మూడు సెంచరీలు కూడా విదేశాల్లో చేసినవే. ఈ గణాంకాలు బాగున్నాయి. ఇవి చూసుకుంటే అతడు జట్టులో ఉంటాడు' అని చోప్రా చెప్పాడు.

చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో విఫలం
'టెస్టుల్లో చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ స్కోర్లు 6, 13, 38, 44, 9, 0, 2, 44, 2, 33 మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ లెక్కలే తొలి టెస్టుకి అతడ్ని దూరంగా ఉంచే అవకాశం ఉంది. ఇక రాహుల్ సన్నాహక మ్యాచ్ ఆడకపోవడం కూడా అతనికి వ్యతిరేకంగా ఉంది. మొదటగా జట్టు యాజమాన్యం అతడిని లెక్కలోకి తీసుకోలేదు. పరిస్థితుల కారణంగా ఇప్పుడు రేసులోకి వచ్చాడు. ఏదేమైనా అతడు ఆడుతాడా? లేదా? అనేది వేరే ప్రశ్న. మొదటి టెస్ట్ కోసం ఎంపిక చేసే తుది జట్టులో రాహుల్ పేరు ఉండదని నేను భావిస్తున్నా' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

రాహుల్‌తోనే ఓపెనింగ్ చేయించాలి
ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ల గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. మయాంక్ అగర్వాల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరని చర్చిస్తున్నారు. అయితే భారత్ ఓపెనింగ్ బలహీనంగా ఉందని చెప్పను. కానీ మయాంక్‌తో కలిసి శుభమన్ గిల్ లేదా పృథ్వీ షా కాకుండా కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలి. అతడు ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగులు చేస్తే టీమిండియా బలహీనత బలంగా మారుతుంది. మయాంక్ కూడా గత పర్యటనలో కీలక పరుగులు సాధించాడు. అంతేగాక మయాంక్-కేఎల్ రాహుల్ మధ్య సమన్వయం గొప్పగా ఉంటుంది. టెస్టుల్లో రాహుల్ ఆడాలని నేను కోరుకుంటున్నా' అని తాజాగా ఆశిష్ నెహ్రా అన్నాడు.

అందుకే రాహుల్ వైపు
కర్ణాటకకి చెందిన మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ సుదీర్ఘకాలం దేశవాళీలో ఓపెనర్లుగా ఆడారు. అలానే ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున మయాంక్, కేఎల్ రాహుల్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఓపెనర్లుగా ఆడుతున్న ఈ ఇద్దరూ మైదానంలోనే కాదు వెలుపల కూడా మంచి ఫ్రెండ్స్. అందుకే రాహుల్ వైపు చూస్తోంది జట్టు యాజమాన్యం. మరి జరుగుతోందో చూడాలి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.


Click it and Unblock the Notifications

మళ్లీ క్రికెట్‌లోకి యువరాజ్ సింగ్.. ఆ జట్టులో యువీ పేరు!!










