
45 నిమిషాల పాటు వర్షం
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు గురువారం సాయంత్రం ప్రాక్టీస్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సుమారు 45 నిమిషాల పాటు వర్షం కురవడంతో కోహ్లీ సేన ప్రాక్టీస్ చేయలేకపోయింది. అయితే, గురువారం ఉదయమే అక్కడికి చేరుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం మధ్యాహ్నం కాసేపు ప్రాక్టీస్ చేశారు.

గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు
'రాంచీలో ప్రస్తుతం సాధారణ వాతావరణం ఉంది. గత రెండు రోజులుగా వర్షం వచ్చి కాసేపట్లోనే వెళ్లిపోతోంది. గత ఏడాది కూడా ఈ సమయంలో ఇలాంటి వాతావరణమే ఇక్కడ ఉంది. శనివారం ఒకవేళ వర్షం పడినా ఎక్కువ సేపు ఉండకపోవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు సిబ్బందితో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాం' అని జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ అధికారి ఒకరు తెలిపారు.

రాంచీ వేదికగా శనివారం తొలి టీ20
ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య శనివారం రాంచీ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ని 1-4తో చేజార్చుకున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో కనీసం టీ20 సిరీస్‌లోనైనా భారత్‌కి గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది.

టీ20 సిరిస్ ట్రోఫీతోనే స్వదేశానికి వెళ్తాం
టీ20 సిరిస్ ట్రోఫీతోనే స్వదేశానికి వెళ్తామని ఐదు వన్డే ఓటమి అనంతరం స్మిత్ చెప్పిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ మైదానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సొంత మైదానం అన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











