Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెంబర్‌ 2 లక్ష్యంగా కోహ్లీసేన: రాంచీ పిచ్‌పై మంచి రికార్డు

హైదరాబాద్: టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న కోహ్లీసేన తాజాగా ఆస్ట్రేలియాపై 4-1తో వన్డే సిరిస్‌ను సొంతం చేసుకుని వన్డేల్లోనూ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే ఆసీస్‌తో మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమైంది.

ఈ సిరిస్‌తో టీ20ల్లో రెండో ర్యాంకుపై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ధోనీ సొంత స్టేడియమైన రాంచీలో జరిగే తొలి టీ20లో కోహ్లీసేన కంగారూలను ఎదుర్కో నుంది. ఈ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంటే ఐదో ర్యాంక్‌ నుంచి రెండో స్థానానికి ఎగబాగుతుంది.

అదే 2-1తో విజయం సాధిస్తే ర్యాంకులో ఎలాంటి మార్పు ఉండదు. మరోవైపు వన్డే సిరీస్‌ పరాజయ భారంతో కుంగిపోయి ఉన్న ఆసీస్‌ ఈ సిరీస్‌లోనైనా పుంజుకోవాలని ఆశిస్తోంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన మూడు టీ20ల సిరిస్ తర్వాత ఆ జట్టు ఈ ఫార్మాట్‌లో పాల్గొనలేదు.

ఇప్పటివరకు భారత్‌, ఆసీస్‌ల మధ్య టీ20 గణాంకాలను పరిశీలిస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. టీ20ల్లో ఇరుజట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ తొమ్మిది విజయాలు సాధించగా, కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ఓటి పాలైంది. దీనికి తోడు ఆసీస్‌పై వరుసగా ఆరు విజయాలు సాధించిన రికార్డు ఉంది.

 మూడు టీ20లు

మూడు టీ20లు

2016లో ఆసీస్‌ పర్యటనలో భాగంగా భారత్‌ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం విశేషం. తొలి టీ20లో అందరి దృష్టి ధోనిపైనే ఉంది. ధోని సొంతగడ్డ రాంచీలో జరుగుతున్న మ్యాచ్‌ కాబట్టి అభిమానులు స్టేడియానికి పోటెత్తనున్నారు. ధోని నుంచి ఓ భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తారు కాబట్టి అందరి దృష్టీ అతనిపైనే ఉంటుంది.

తిరిగి జట్టులో చేరిన ధావన్

తిరిగి జట్టులో చేరిన ధావన్

ఇక భార్య అనారోగ్యం కారణంగా వన్డేలకు దూరమైన శిఖర్‌ ధావన్‌ తిరిగి జట్టులో చేరాడు. దీంతో భారత జట్టు మరింత పటిష్ఠంగా మారింది. ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. కోహ్లీ వన్‌డౌన్‌కే పరిమితం కానున్నాడు. మరోవైపు భారత్‌ను వేధిస్తున్న నాలుగో స్థానం కోసం మనీష్‌ పాండే, కేఎల్‌ రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌ మధ్య పోటీ నెలకొంది.

బౌలింగ్‌లోనూ బలంగా భారత్‌

బౌలింగ్‌లోనూ బలంగా భారత్‌

మరోవైపు నెహ్రా కూడా రావడంతో బౌలింగ్‌లోనూ భారత్‌ బలంగానే కన్పిస్తోంది. భువనేశ్వర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా ఫామ్‌లో ఉన్నారు. మన స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాళ్లకు ఐపీఎల్‌ కలిసొస్తుందేమో చూడాలి. వన్డే సిరీస్‌ ఓటమిని పక్కనబెట్టి టీ20 ఫార్మాట్‌‌ను ఫ్రెష్‌గా ఆరంభించాలని ఆసీస్ కోరుకుంటోంది.

టీ20 స్పెషలిస్టులతో బలోపేతమైన ఆసీస్

టీ20 స్పెషలిస్టులతో బలోపేతమైన ఆసీస్

టీ20 స్పెషలిస్టులు డానియెల్‌ క్రిస్టియన్‌, మోసీ హెన్రిక్స్‌ రాకతో ఆసీస్‌ బలోపేతమైంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో స్మిత్‌ రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌కి, డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి, మ్యాక్స్‌వెల్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు కెప్టెన్లుగా వ్యవహరించారు. పుణెను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో స్మిత్‌ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో భాగంగా వీరికి భారత్‌లోని అన్ని పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. ఇక ఆసీస్‌ బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన బౌలర్లు స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ జట్టులో లేరు.

ఈ పిచ్‌పై టీమిండియా మంచి రికార్డు

ఈ పిచ్‌పై టీమిండియా మంచి రికార్డు

ఈ పిచ్‌పై టీమిండియా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు దీనిపై భారత్‌ 4 వన్డేలు, ఒక టీ 20 ఆడింది. వీటిలో మూడింట్లో విజయం సాధించగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్‌తో ఓ వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇది బ్యాటింగ్‌ పిచ్‌. అయితే రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు పేసర్లకు అనుకూలించవచ్చు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం కారణంగా శుక్రవారం జరగాల్సిన భారత ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా రద్దయింది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+