తొలి టీ20కి 12మందితో జట్టు ప్రకటన: ముగ్గురు స్పిన్నర్లతో ఆసీస్‌పై ఎటాక్!


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 బుధవారం జరగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సుదీర్ఘ పర్యటనకు తెరలేవనుంది.
ఈ నేపథ్యంలో తొలి టీ20లో తలపడే తుది జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 12 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇందులో ఇద్దరు చైనామన్ స్పినర్లు కుల్దీప్, చాహల్ కాగా మరొకరు కృనాల్ పాండ్యాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

విండిస్ సిరిస్‌తో అరంగేట్రం చేసిన పాండ్యా
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా కృనాల్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. విండిస్‌తో జరిగిన సిరీస్‌లో పాండ్యా మూడు టీ20ల్లోనూ ఆడాడు. ఇక, కుల్దీప్ మాత్రం మొదటి రెండు మ్యాచుల్లో ఆడాడు. చెన్నై వేదికగా జరిగిన ఆఖరి టీ20లో కుల్దీప్ స్థానంలో చాహల్‌కు జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది.

రెండు మ్యాచులు కలిపి ఐదు వికెట్లు తీసిన కుల్దీప్
కాగా, విండిస్‌తో ఆడిన రెండు మ్యాచులు కలిపి కుల్దీప్ ఐదు వికెట్లు తీయగా, ఒకే మ్యాచ్ ఆడిన చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఇక, మూడు మ్యాచ్‌ల్లో ఆడిన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకి ఒక్క ఇన్నింగ్స్‌లోనే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

బుమ్రా, భువీ ఆడితే ఖలీల్ అహ్మద్‌కి విశ్రాంతి!
దీంతో కృనాల్ పాండ్యాను మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం ఉంది. ఇక, బీసీసీఐ ప్రకటించిన ఈ 12 మంది జట్టు సభ్యుల్లో పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు ఉన్నారు. మరోవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌కి కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20లో భువీ, బుమ్రా ఇద్దరూ ఆడితే ఖలీల్‌కి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇక, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.
తొలి టీ20లో ఆడే భారత జట్టు:
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications