న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్మప్‌ సమయంలో జగ్లింగ్‌తో ఆకర్షించిన రోహిత్.. విఫలమయిన ధావన్ (వీడియో)!!

India vs Australia 1st ODI: Rohit Sharma brings new challenge for his mates in Mumbai

ముంబై: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జట్టు స్కోర్ 13 వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టు వార్మప్ చేస్తుండగా 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ అందరి దృష్టిని ఆకర్షించాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. మూడో స్థానంలో రాహుల్!!టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. మూడో స్థానంలో రాహుల్!!

టీమిండియా వార్మప్ సమయంలో రోహిత్ జగ్లింగ్ (మూడు బంతులను ఎగరేస్తూ ఆడే ఆట) చేస్తూ కనిపించాడు. మూడు బంతులతో జగ్లింగ్ చేయడం చాలా కష్టం. దానికి చాలా శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మ్యాచ్‌కు ముందు ఏకాగ్రత కోసం రోహిత్ అలా సాధన చేసాడు. రోహిత్‌ను చూసిన మిగతా జట్టు సభ్యులు కూడా జగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారు. యజువేంద్ర చహల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు విఫలం అయ్యారు.

ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ జగ్లింగ్ ఛాలెంజ్‌లో విఫలమయ్యాడు. అయితే రెండు బంతులతో జగ్లింగ్ చేసి సక్సెస్ అయ్యాడు. రెండు బంతులతో చేసున్న ధావన్‌ను చూసి జట్టు సభ్యులంతా నవ్వుకున్నారు. ముఖ్యంగా జడేజా, రోహిత్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు అందరూ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొదటగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి వికెట్ కోల్పోయింది. బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించిన హిట్‌మ్యాన్ త్వరగానే పెవిలియన్ చేరాడు. పేసర్ మిషెల్ స్టార్క్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన రోహిత్.. మిడాఫ్‌లో వార్నర్ చేతికి చిక్కాడు. రెండు ఫోర్లు బాదిన రోహిత్ 10 పరుగులకే వెనుదిరిగాడు. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. ధావన్- రాహుల్ .ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. తొలి పవర్‌ప్లే ముగిసింది. 10 ఓవర్ల పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. ధావన్ (37), రాహుల్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Story first published: Tuesday, January 14, 2020, 15:01 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X