
కన్‌కషన్‌కు గురైన పంత్:
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (33 బంతుల్లో 28; ఫోర్లు 2, సిక్స్ 1) గాయం బారిన పడ్డాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో పంత్ గాయపడ్డాడు. కమిన్స్ వేసిన బంతి ముందుగా బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత అతని తలకు బలంగా తాకి క్యాచ్‌గా మారింది. ఇన్నింగ్స్ అనంతరం పంత్ 'కన్‌కషన్'కు (తల తిరగడం) గురైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతను కీపింగ్ చేయ లేడని కూడా తెలిపింది.

పంత్ ఆడినా.. రాహులే కీపింగ్:
పంత్ గాయపడడంతో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇక పంత్ గాయాన్ని ప్రస్తుతం ప్రత్యేక వైద్యులు పర్యవేక్షిస్తున్నారని బోర్డు ప్రకటించింది. ముగ్గురు ఓపెనర్లు బరిలోకి దిగితే పంత్‌ను తుది జట్టు నుంచి తప్పించవచ్చని, రాహుల్ కీపింగ్ చేస్తాడని మ్యాచ్‌కు ముందు వార్తలు వచ్చాయి. అయితే చివరకు పంత్ ఆడినా.. రాహులే కీపింగ్ చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్‌లో మెరిసిన రాహుల్.. కీపింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేదు. రాహుల్ (47) పరుగులతో రాణించాడు.

టీమిండియా ఓటమి:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వార్నర్, ఫించ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. సిరీస్‌లో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

అతి జాగ్రత్తగా ఆడాం:
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలం అయ్యాం. బలమైన ఆస్ట్రేలియాపై సరిగ్గా ఆడకపోతే వాళ్లు ఓడిస్తారు. ఈ విషయం మా బ్యాటింగ్ ద్వారా అర్థమైంది. మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో మేం అతి జాగ్రత్తగా ఆడాం. అదే మా కొంప ముంచింది. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుతో అలా ఆడాల్సింది కాదు. టీమిండియా ఇప్పుడు కోలుకోవాల్సిన సమయం ఉంది' అని అన్నాడు.


Click it and Unblock the Notifications












