న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు భారత్-ఆసీస్ తొలి వన్డే.. నాలుగో స్థానంలో కోహ్లీ.. కీపర్‌గా రాహుల్‌!!

IND VS AUS 2020,1st ODI : Virat Kohli Could Bat @ No.4 To Include Shikhar Dhawan & KL Rahul !
India vs Australia 1st ODI Preview: Predicted Playing XI, Weather Report, Pitch Report, ODI Dream11 Team

ముంబై: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలను మట్టికరిపించిన భారత్‌కు అసలైన సమరం ముందుంది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు టీమిండియాకు అసలు సవాల్‌ విసరనుంది. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత బలమైన ప్రత్యర్థితో తలపడని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పోరుకు సన్నద్ధమైంది.

సెమీస్‌లోనే ఓడిన ఆసీస్‌.. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ వన్డే బరిలోకి దిగుతోంది. పూర్తి స్థాయి జట్టుతో కంగారూలు పటిష్టంగా కనిపిస్తుండగా.. స్వదేశంలో కోహ్లీసేన ఏ రకంగా చూసినా బలమైనదే. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ఆ-స్ట్రేలియా తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

<strong>ఖేలో ఇండియాలో సూర్యదేవ్‌కు కాంస్యం.. తెలంగాణ ఖాతాలో నాలుగో పతకం!!</strong>ఖేలో ఇండియాలో సూర్యదేవ్‌కు కాంస్యం.. తెలంగాణ ఖాతాలో నాలుగో పతకం!!

నాలుగో స్థానంలో కోహ్లీ

నాలుగో స్థానంలో కోహ్లీ

'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ పునరాగమనం చేయడంతో అతనితో పాటు రెండో ఓపెనర్‌ స్థానం విషయంలో ఆసక్తికర చర్చ నడిచింది. లోకేశ్‌ రాహుల్‌ ఫామ్‌లో ఉండటం, శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో శిఖర్‌ ధావన్‌ అర్ధ సెంచరీ చేయడంతో.. అందరూ ఈ ఇద్దరిలో ఒక్కరికే అవకాశం వస్తుంది అనుకున్నారు. అయితే రోహిత్‌తో ఓపెనర్‌గా దిగేదెవరో అనే సందేహాలకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానాన్ని వదులుకొని ఈ ఇద్దరినీ తుది జట్టులో ఆడించేందుకు కోహ్లీ రెడీ అయిపోయాడు. దీంతో నాలుగో స్థానంలో కోహ్లీ రానున్నాడు.

 జాదవ్‌కు లాస్ట్‌ చాన్స్‌:

జాదవ్‌కు లాస్ట్‌ చాన్స్‌:

నాలుగో నెంబర్‌లో సత్తా నిరూపించుకునేందుకు శ్రేయాస్‌ అయ్యర్‌కు కూడా ఇదే మంచి అవకాశం. అయితే రోహిత్‌, ధావన్, రాహుల్‌ జట్టులో ఉండడంతో అయ్యర్‌ బ్యాటింగ్‌స్థా నం కిందకు దిగడం ఖాయం. మరి కోహ్లీ అయ్యర్‌ను నాలుగో నెంబర్‌లోలో పంపిస్తాడో చూడాలి. ఇక కేదార్‌ జాదవ్‌ శక్తికిమించి రాణించకపోతే అతడికి ఇదే చివరి వన్డే సిరీస్‌ కావొచ్చు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు నిరాశే ఎదురవనుంది. రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు అప్పగించనున్నారు.

బుమ్రాకు జోడి ఎవరు

బుమ్రాకు జోడి ఎవరు

ఆల్‌రౌండర్‌గా జడేజా, ఏకైక స్పిన్నర్‌గా కుల్దీప్‌కు చోటు దక్కడం ఖాయం. జాదవ్‌ కూడా మూడో స్పిన్నర్‌ బాధ్యతలు మోస్తాడు. ప్రపంచకప్‌ తర్వాత బుమ్రా ఆడనున్న తొలి వన్డే ఇదే. అతనికి తోడుగా షమీ, నవదీప్‌ సైనీలలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో శార్దుల్‌ ఉండడం సహజమే.

స్మిత్, వార్నర్‌ రెడీ

స్మిత్, వార్నర్‌ రెడీ

ఏడాది క్రితం నిషేధం కారణంగా అందుబాటులో లేని వార్నర్, స్మిత్‌ ఈసారి భారత గడ్డపై తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. వార్నర్, ఫించ్‌ ఆసీస్‌కు శుభారంభం అందిస్తే.. మూడో స్థానంలో స్మిత్‌ దానిని కొనసాగించగలడు. ఇక లబ్‌షేన్‌ తొలిసారి వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. మిడిలార్డర్‌లో హ్యాండ్స్‌కోంబ్, అలెక్స్‌ క్యారీ బ్యాటింగ్‌ భారం మోస్తారు. ఆల్‌రౌండర్‌ స్థానంలో అగర్‌.. స్పిన్నర్‌గా ఆడమ్‌ జంపా జట్టులో ఉంటారు. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ పేస్ బాధ్యతలు మోయనున్నారు.

పిచ్, వాతావరణం

పిచ్, వాతావరణం

వాంఖడే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. పిచ్‌పై పచ్చిక కనిపిస్తున్నది. సాయంత్రం వేళ మంచుపడే అవకాశం ఉండటంతో టాస్‌ గెలిచిన జట్టు లక్ష్యఛేదనకు మొగ్గుచూపొచ్చు. ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20లోనే భారత్‌ 240 పరుగులు చేసింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), అయ్యర్‌, జాదవ్‌, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, షమీ/సైనీ, బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, హ్యాండ్స్‌కోంబ్‌, కారీ, అగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, హజిల్‌వుడ్‌, జంపా.

Story first published: Tuesday, January 14, 2020, 9:00 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X