Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ వన్డే: కుల్దీప్ స్లో డెలివరీ.. ధోని సూపర్ స్టంపింగ్ (వీడియో)

India Vs Australia, 1st ODI, Live Updates: Kuldeep-Dhoni pair removes Handscomb

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన వికెట్ కీపింగ్ విన్యాసాలను ప్రదర్శించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు బుమ్రా తొలి తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్‌తో కలిసి ఉస్మాన్ ఖావాజా ఆచితూచి ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఖవాజ 76 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 50 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడిని కేదార్ జాదవ్ విడదీశాడు.

1
45585
కోహ్లీ సూపర్ క్యాచ్

కోహ్లీ సూపర్ క్యాచ్

స్టోయినిస్‌(37) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా(50)ను కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఖవాజా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ధోని స్టంపౌట్ మ్యాచ్‌కే హైలెట్

ధోని స్టంపౌట్ మ్యాచ్‌కే హైలెట్

ఓ వైపు వికెట్లు పడుతున్నా మ్యాక్స్‌వెల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. హ్యాండ్స్‌కాంబ్ (19)తో కలిసి ఆస్ట్రేలియా స్కోరు బోర్డుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ స్లో డెలివరీని ముందుకొచ్చి ఆడే క్రమంలో హ్యాండ్స్‌కాంబ్‌ని ధోని స్టంపౌట్ చేశాడు. ఈ స్టంపౌట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

భారత బౌలర్లు అదుర్స్

కుల్దీప్ వేసిన స్లో డెలివరీని ముందుకొచ్చి ఆడేందుకు హాండ్స్‌కాంబ్ ప్రయత్నించగా బంతి అతని బ్యాట్-ప్యాడ్ మధ్యలోంచి వెళ్లి నేరుగా భారత వికెట్ కీపర్ ధోనీ చేతిలో పడింది. ఇక, ధోని స్టంపౌట్ చేయగానే హ్యాండ్స్‌కాంబ్‌ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు.

టీమిండియా విజయ లక్ష్యం 237

దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Story first published: Saturday, March 2, 2019, 18:01 [IST]
Other articles published on Mar 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+