For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ వన్డే: ఖవాజా 50, భారత్ విజయ లక్ష్యం 237

India vs Australia 1st ODI Live Cricket Score: Khawaja, Maxwell Take Australia To 236/7 Against India

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు బుమ్రా తొలి తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్‌తో కలిసి ఉస్మాన్ ఖావాజా ఆచితూచి ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు.

ఖవాజ హాఫ్ సెంచరీ

ఖవాజ హాఫ్ సెంచరీ

ఈ క్రమంలో ఖవాజ 76 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 50 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడిని కేదార్ జాదవ్ విడదీశాడు. స్టోయినిస్‌(37) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు.

అద్భుత క్యాచ్ అందుకున్న విజయ్ శంకర్

అద్భుత క్యాచ్ అందుకున్న విజయ్ శంకర్

ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా(50)ను కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఖవాజా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మ్యాక్స్‌వెల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

మ్యాక్స్‌వెల్ దూకుడికి షమీ అడ్డుకట్ట

హ్యాండ్స్‌కాంబ్ (19)తో కలిసి ఆస్ట్రేలియా స్కోరు బోర్డుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ స్లో డెలివరీని ముందుకొచ్చి ఆడే క్రమంలో హ్యాండ్స్‌కాంబ్‌ని ధోని స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన టర్నర్ (21)తో కలిసి రెండో టీ20లో భారత బౌలర్లను ఆటాడుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (40) ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు.

వరుస ఓవర్లలో బౌల్డ్ చేసిన షమీ

మ్యాక్స్‌వెల్ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో షమీ వరుస ఓవర్లలో వీరిద్దర్నీ బౌల్డ్ చేశాడు. చివర్లో చివర్లో కౌల్టర్ నైల్ (28), అలెక్స్ కేరీ (36 నాటౌట్) ఏడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

1
45585
Story first published: Saturday, March 2, 2019, 17:33 [IST]
Other articles published on Mar 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+