For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తనదైన శైలిలో మ్యాచ్‌ని ముగించిన ధోని: ఉప్పల్ వన్డేలో భారత్ విజయం

Dhoni

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేదార్ జాదవ్ (81 నాటౌట్), ధోనీ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి భారత్ 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 81 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించిన కేదార్ జాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఆస్ట్రేలియా బౌలర్లు కౌల్టర్ నైల్, జంపా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 5న నాగ్‌పూర్ వేదికగా జరగనుంది.

237 పరుగుల లక్ష్యంతో

237 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. ఈ దశలో రోహిత్-కోహ్లి రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతోన్న సమయంలో భారత జట్టుని జంపా దెబ్బతీశాడు. వరుసగా రెండు బౌండరీలు బాదిన కోహ్లీ (44)ని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే

ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ (37)సైతం చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. క్రీజ్‌లో కుదురుకుంటున్న అంబటి రాయుడు (13)ను ఔట్ చేసిన జంపా మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఒకానొక దశలో 80/1తో పటిష్టంగా కనిపించిన భారత్ 20 పరుగుల తేడాలో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత్‌ను ధోనీ-జాదవ్ ఆదుకున్నారు.

పరుగుల వరద

వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ధోని సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో జాదవ్, ధోనీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోనికి ఇది వన్డేల్లో 71వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. 49వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ధోని మ్యాచ్‌ని తనదైన శైలిలో ముగించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు బుమ్రా తొలి తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్‌తో కలిసి ఉస్మాన్ ఖావాజా ఆచితూచి ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు.

ఖవాజ హాఫ్ సెంచరీ

ఖవాజ హాఫ్ సెంచరీ

ఈ క్రమంలో ఖవాజ 76 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 50 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడిని కేదార్ జాదవ్ విడదీశాడు. స్టోయినిస్‌(37) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు.

అద్భుత క్యాచ్ అందుకున్న విజయ్ శంకర్

అద్భుత క్యాచ్ అందుకున్న విజయ్ శంకర్

ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా(50)ను కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఖవాజా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మ్యాక్స్‌వెల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

మ్యాక్స్‌వెల్ దూకుడికి షమీ అడ్డుకట్ట

హ్యాండ్స్‌కాంబ్ (19)తో కలిసి ఆస్ట్రేలియా స్కోరు బోర్డుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ స్లో డెలివరీని ముందుకొచ్చి ఆడే క్రమంలో హ్యాండ్స్‌కాంబ్‌ని ధోని స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన టర్నర్ (21)తో కలిసి రెండో టీ20లో భారత బౌలర్లను ఆటాడుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (40) ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు.

వరుస ఓవర్లలో బౌల్డ్ చేసిన షమీ

మ్యాక్స్‌వెల్ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో షమీ వరుస ఓవర్లలో వీరిద్దర్నీ బౌల్డ్ చేశాడు. చివర్లో చివర్లో కౌల్టర్ నైల్ (28), అలెక్స్ కేరీ (36 నాటౌట్) ఏడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Story first published: Sunday, March 3, 2019, 7:52 [IST]
Other articles published on Mar 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+