బుమ్రా వేసే బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి: వార్నర్

ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని ఆయన అంటున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలోటీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఘన విలయం సాధించింది. వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా సునాయాస విజయాన్ని అందుకుంది.

తేలిపోయిన భారత బౌలర్లు:
ముంబై వన్డేలో భారత బౌలర్లు బుమ్రా (7 ఓవర్లకు 50), మొహమ్మద్ షమీ (7.4 ఓవర్లకు 58), శార్దూల్ ఠాకూర్ (5 ఓవర్లకు 43), కుల్‌దీప్ యాదవ్ (10 ఓవర్లకు 55), రవీంద్ర జడేజా (8 ఓవర్లకు 41) పూర్తిగా విఫలమయ్యారు. అందరూ టాప్ బౌలర్లు అయినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్లు కాస్త పర్వాలేదనిపించినా.. పేసర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా పునరాగమనం చేసిన బుమ్రా. అయినా కూడా బుమ్రాపై వార్నర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం:
మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ... 'బ్రెట్‌లీ లాంటి బౌలర్ కొంత తడబడుతూ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బుమ్రా బౌలింగ్‌లో మార్పు చేస్తే కష్టంగా అనిపిస్తుంది. లసిత్ మలింగ 140 కి.మీ వేగంతో స్వింగ్ చేసినప్పుడు ఎదుర్కొనేందుకు ఉండేంత సంక్లిష్టంగా అనిపిస్తుంది. అయితే క్రీజులో నిలదొక్కుకోవడంతోనే పరుగులు చేశా' అని తెలిపాడు.

కుల్‌దీప్ బౌలింగ్‌లో మార్పు:
'యార్కర్లు, బౌన్సర్ వస్తాయని ముందే తెలిసినప్పుడు వాటికెలా స్పందిస్తామన్నదే మనల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. మన ఆట అప్పుడే బయటపడుతుంది. ఇక స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లోనూ మార్పు కనిపించింది. గతంతో పోలిస్తే అతడి బౌలింగ్‌లో వేగం కొంత తగ్గినట్టు ఉంది. 100 కి.మీ వేగంతో బంతులేసే రషీద్ పోలిస్తే పూర్తిగా భిన్నం. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎడమ చేతివాటం చైనామన్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

వార్నర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్':
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వార్నర్, ఫించ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. సిరీస్‌లో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications