For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs Australia, 1st ODI: కోహ్లీసేన విజయ లక్ష్యం 289

India Vs Australia, 1st ODI: India need 289 to win Sydney ODI against Australia

హైదరాబాద్: సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖ‌వాజా (59), షాన్ మార్ష్ (54), హ్యాండ్స్ కోంబ్ (73) హాఫ్ సెంచరీలు చేశారు.

ఆట ఆరంభంలో టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచినా.. ఆ తర్వాత ఆసీస్ బ్యాట్స్‌మన్ కుదురుకున్నారు. చివర్లో ఆల్ రౌండ‌ర్ స్టోయినిస్ మెరుపులు మెరిపించాడు. 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 47 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, కుల్దీప్‌ల‌కి రెండు వికెట్స్ పడగొట్టగా... జ‌డేజాకు ఒక్క వికెట్ లభించింది.

టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్‌

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌(6) మూడో ఓవర్‌లోనే ఔటయ్యాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఆసీస్‌ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

వన్డేల్లో 100వ వికెట్ తీసిన భువీ

వన్డేల్లో భువనేశ్వర్ కుమార్‌కి ఇది 100వ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత అలెక్స్‌ క్యారీ (24), ఉస్మాన్ ఖవాజాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ కలిసి 33 పరుగులు జత చేసిన తర్వాత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్యారీ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్ష్‌ తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్‌ని నడిపించాడు.

బ్రేక్ ఇచ్చిన జడేజా

ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఖవాజాను జడేజా ఔట్‌ చేసి భారత్‌కు చక్కటి బ్రేక్‌ ఇచ్చాడు. ఆసీస్‌ జట్టు మరో 53 పరుగులు జోడించిన తర్వాత మార్ష్‌ను కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో మార్ష్‌ భారీ షాట్‌కు యత్నించగా లాంగాన్‌లో మహ్మద్‌ షమీ క్యాచ్‌ పట్టాడు. దాంతో ఆసీస్‌ 186 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

కుల్దీప్‌ ఓవర్‌లో రెండు సిక్సులు

ఈ సమయంలో పీటర్ హ్యాండ్స్ కోంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి క్రీజులో ఉన్న మరో బ్యాట్స్‌మన్ మార్కస్‌ స్టోనిస్‌ చక్కటి సహకారం అందించాడు. దాంతో ఆసీస్‌ 42వ ఓవర్‌లో రెండొందల పరుగుల మార్కును చేరింది. కుల్దీప్‌ వేసిన 44 ఓవర్‌లో వీరిద్దరూ తలో సిక్సర్‌ బాదారు.

చివరి రెండు ఓవర్లలో 29 పరుగుల రాబట్టిన ఆసీస్

ఇక భువనేశ్వర్‌ వేసిన 46వ ఓవర్‌లో వీరిద్దరూ చెరొక ఫోర్‌ కొట్టారు. ఆపై భువీ వేసిన 48 ఓవర్‌లో తొలి బంతిని సిక్స్‌ కొట్టిన హ్యాండ్‌ స్కోంబ్ ఆ తర్వాత బంతికే పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి శిఖర్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ 29 పరుగులు రాబట్టారు.

భారత లక్ష్యం 289

అంతేకాదు ఆఖరి పది ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే తీసిన భారత జట్టు 93 పరుగుల్ని సమర్పించుకుంది. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, January 12, 2019, 12:31 [IST]
Other articles published on Jan 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+