For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 1st ODI: వన్డేల్లో 100వ వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్

India vs Australia 1st ODI : Bhuvneshwar Kumar Is 4th Indian To Reach 100 ODI wickets | Oneindia
Bhuvneshwar Kumar

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ ఆరోన్ ఫించ్ వికెట్ తీయడంతో వన్డేల్లో 100వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (6:ని భువీ పెవిలియన్ బాట పట్టించాడు.

ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డయ్యాడు. నిజానికి భువీ తొలి ఓవర్‌లోనే ఆరోన్ ఫించ్ ఎల్బీగా డకౌట్‌ కావాల్సింది. కానీ, అంపైర్ భారత్ ఔట్ అప్పీల్‌ని తిరస్కరించాడు. ఈ సిరిస్‌లో అరోన్ ఫించ్ వైఫల్యాల బాట కొనసాగుతోంది. ముఖ్యంగా భారత పేసర్లను ఎదుర్కొనడంలో ఫించ్ ఇబ్బందులు పడుతున్నాడు.

1
43627

మూడు టీ20లు, ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లతో పాటు ఈరోజు తొలి వన్డే మ్యాచ్‌లోనూ అతను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు. పేలవ ఫుట్‌వర్క్ కారణంగా ఫాస్ట్ బౌలర్లకి అతను అలవోకగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో గత ఏడాది కాలంగా అరోన్ ఫించ్ తరహాలో ఎవరూ భీకరంగా హిట్టింగ్ చేయలేదు.

దీంతో భారత్‌తో సిరీస్‌లో ఆరోన్ ఫించ్ కీలకం అవుతాడని అంతా భావించారు. అందుకు భిన్నంగ్ ఫించ్ పేలవంగా తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఆరోన్ ఫించ్ పేలవ ఫామ్ కారణంగా కనీసం ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా జట్టుకి మెరుగైన ఆరంభం లభించలేదు. దీంతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఏకంగా సెలక్టర్లు వేటు కూడా వేశారు.

టీ20, టెస్టుల ఫామ్‌ని పట్టించుకోని ఆస్ట్రేలియా సెలక్టర్లు తాజాగా వన్డే సిరీస్‌లో అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది మార్చిలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పునరాగమనం చేసే లోపు ఆరోన్ ఫించ్ ఫామ్ అందుకుంటే తప్ప.. ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌‌లో అతను ఆడేది అనుమానంగానే ఉంది.

Story first published: Saturday, January 12, 2019, 9:04 [IST]
Other articles published on Jan 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+