న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. మూడో స్థానంలో రాహుల్!!

India vs Australia 1st ODI: Australia have won the toss and have opted to field

ముంబై: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబైలోని వాంఖడే మైదానంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. యువ ఆటగాడు మార్నస్ లబ్‌షేన్‌ వన్డే ఆరంగేట్రం చేసాడు. హాజల్‌వుడ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు భారత జట్టులో కేదార్ జాదవ్‌పై వేటు పడింది. లోకేశ్‌ రాహుల్‌, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లు ప్లేయింగ్-11లో ఉన్నారు. షమీ ఉండడంతో సైనీకి అవకాశం దక్కలేదు.

టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు.. కొత్తగా 4 టీమ్స్‌కు అవకాశం!!టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు.. కొత్తగా 4 టీమ్స్‌కు అవకాశం!!

వన్డే ప్రపంచకప్‌-2019 లీగ్‌ దశలో ఎదురుపడ్డ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. రెండు జట్లలో బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయి. గతేడాది కంగారూలతో స్వదేశంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. అయితే ఈసారి మరింత బలంగా కనిపిస్తున్న ఆసీస్ సిరీస్‌ కొట్టాలని చూస్తోంది.

వాంఖడే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20లోనే భారత్‌ 240 పరుగులు చేసింది. పిచ్‌పై పచ్చిక కనిపిస్తున్నది. సాయంత్రం వేళ మంచుపడే అవకాశం ఉండటంతో టాస్‌ గెలిచిన ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు.

రెండేండ్ల క్రితం వాంఖడేలో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (121) సెంచరీ చేసాడు. అనంతరం లాథమ్‌ (103), టేలర్‌ (95) చెలరేగడంతో కివీస్‌ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Teams:
India (Playing XI): Rohit Sharma, Shikhar Dhawan, Lokesh Rahul, Virat Kohli(c), Shreyas Iyer, Rishabh Pant(w), Ravindra Jadeja, Shardul Thakur, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah.

Australia (Playing XI): David Warner, Aaron Finch(c), Marnus Labuschagne, Steven Smith, Ashton Turner, Alex Carey(w), Ashton Agar, Pat Cummins, Mitchell Starc, Kane Richardson, Adam Zampa.

Story first published: Tuesday, January 14, 2020, 13:38 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X