Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీలో తొలి వన్డే: ఆసీస్ బ్యాటింగ్, జట్టులోకి జడేజా, దినేశ్ కార్తీక్

 Aaron Finch elects to bat against settled Indian side

హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టెస్టు సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా, వన్డే సిరీస్‌నూ సత్తా చాటాలని చూస్తోంది.

టాస్ గెలిస్తే... తాను కూడా తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపేవాడినని విరాట్ కోహ్లీ టాస్ సమయంలో వెల్లడించాడు. భారత్ జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. దీంతో భారత జట్టు కూడా సమతూకంగానే కనిపిస్తోంది. సస్పెండ్‌కి గురైన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చాడు.

మూడు నెలల తర్వాత మైదానంలోకి ధోని

మూడు నెలల తర్వాత మైదానంలోకి ధోని

దినేష్ కార్తీక్‌కి చాలా కాలం త‌ర్వాత వ‌న్డేలో ఆడే అవ‌కాశం ద‌క్కింది. ఇక, ధోని దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరఫున మైదానంలోకి దిగుతున్నాడు. ఆసీస్ గడ్డపై వన్డేల్లో భారత్‌కు పేలవ రికార్డే ఉంది. ఎప్పుడో 1985లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్ నెగ్గడంతో పాటు 2008 సీబీ సిరీస్‌ను దక్కించుకుంది.

 48 వన్డేల్లో 35 మ్యాచ్‌ల్లో ఓటమి

48 వన్డేల్లో 35 మ్యాచ్‌ల్లో ఓటమి

ఆసీస్ గడ్డపై ఆడిన మొత్తం 48 వన్డేల్లో 35 మ్యాచ్‌లను ఓడిపోయింది. ఇప్పుడు ఆ రికార్డుని అధిగమించాలని భావిస్తోంది. మరోవైపు, ఆసీస్ ఈ సిరీస్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది. అందుకోసం అనుభవం ఉన్న ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. స్టార్ స్నిన్నర్ నాథన్ లియాన్, పేసర్ సిడిల్ చేరికతో ఆ జ‌ట్టు ఒకింత పటిష్టంగా ఉంది.

భారత్ వన్డే జట్టు:

భారత్ వన్డే జట్టు:

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్

ఆస్ట్రేలియా జట్టు:

ఆస్ట్రేలియా జట్టు:

అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కబ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెరెండ్రాఫ్, పీటర్ సిడిల్, నాథన్ లయన్, రిచర్డ్‌సన్

Story first published: Saturday, January 12, 2019, 8:32 [IST]
Other articles published on Jan 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+