Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేసిన స్టార్ పేసర్!! ఎన్ని రన్స్ ఇచ్చాడంటే?

India vs Australia: 11 balls bowled by Mitchell Starc to complete his 1st over
'

సిడ్నీ: కరోనా మహమ్మారి విరామం అనంతరం తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న టీమిండియా బౌలర్లకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (114; 124 బంతుల్లో 9x4, 2x6), స్టీవ్ ‌స్మిత్‌ (105; 66 బంతుల్లో 11x4, 4x6) శతకాలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (69; 76 బంతుల్లో 6x4), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (45; 19 బంతుల్లో 5x4, 3x6) మెరుపు బ్యాటింగ్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

ఒక ఓవర్ పూర్తి చేయడానికి.. 11 బంతులు:

ఒక ఓవర్ పూర్తి చేయడానికి.. 11 బంతులు:

ఇక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. తన కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా చెత్తగా బౌలింగ్ చేశాడు. ఒక ఓవర్ పూర్తి చేయడానికి ఏకంగా 11 బంతులు వేశాడు. ఇందులో ఆరు లీగల్ బంతులు ఉండగా.. నాలుగు వైడ్ బంతులు, ఒక నో బాల్ ఉంది. ఒక వైడ్ బంతికి, నో బాల్ బంతికి నాలుగు పరుగులు (బౌండరీ) కూడా వచ్చాయి. మొత్తంగా స్టార్క్ 20 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా అదనపు రన్స్ రూపంలో 9 వచ్చాయి.

సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేక:

సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేక:

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో మిచెల్ స్టార్క్ ఆడలేదు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ ఆడలేదు. అయితే ఆసీస్ గడ్డపై షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో మాత్రం ఆడాడు. దీంతో అతడికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. దీంతో స్టార్క్ తన తొలి ఓవర్లోనే లయ తప్పాడు. ఈ క్రమంలోనే ఏకంగా నాలుగు వైడ్ బంతులు విసిరాడు. స్టార్క్ ఆసీస్ తరఫున 57 టెస్టులు, 94 వన్డేలు, 34 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన 7సార్లు చేశాడు.

మరో ఆసక్తికర ఘటన:

మరో ఆసక్తికర ఘటన:

ఈ మ్యాచులో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు నిరసనకారులు పిచ్‌ మీదకు వచ్చి '1 బిలియన్ డాలర్ అదానీ రుణం వద్దు' అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి తేలిగ్గా పిచ్‌ మధ్యలోకి రావడం విస్మయానికి గురి చేసింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని వెనక్కి పంపించారు. మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వెలుపల కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు 'స్టాప్ అదానీ' అంటూ ఆందోళన చేపట్టారు.

మిచెల్ స్టార్క్ ఓవర్ సాగిందిలా:

మిచెల్ స్టార్క్ ఓవర్ సాగిందిలా:

1-Starc to Agarwal, 1 run

2-Starc to Dhawan, wide

3-Starc to Dhawan, no run

4-Starc to Dhawan, 1 run

5-Starc to Agarwal, wide

6-Starc to Agarwal, 5 wides

7-Starc to Agarwal, wide

8-Starc to Agarwal, 1 run

9-Starc to Dhawan, no ball, FOUR

10-Starc to Dhawan, FOUR

11-Starc to Dhawan, no run

Story first published: Friday, November 27, 2020, 15:17 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+