India vs Australia : తొలి టీ20కి వర్ష సూచనపై వాతావరణ విభాగం ఏమందంటే..? మొహాలీ పిచ్ ఎవరికీ అనుకూలం?

నేటి నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి మ్యాచ్ మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) స్టేడియంలో జరగనుంది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు మంచి సన్నాహకం కానుంది. రెండు జట్లు తమ ప్లేయింగ్ 11 కాంబినేషన్లో సమతూకం తెచ్చుకోవడానికి ఈ సిరీస్‌ను ఓ అవకాశంగా భావిస్తున్నాయి.
ఆస్ట్రేలియా జట్టు కీలక ఆటగాళ్లలో కొంతమంది మిస్సయ్యారు. డేవిడ్ వార్నర్, మార్ష్, స్టార్క్, మార్కస్ స్టోయినిస్ లేకుండానే ఆసీస్ బరిలోకి దిగబోతుంది. ఇకపోతే భారత్ తరఫున మాత్రం బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి రావడంతో భారత్ తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది.

ఇరు జట్లకు కొత్తే
ఇక ఈ సిరీస్ పరంగా ఆస్ట్రేలియా టీం ఆటగాళ్ల ఫిట్ నెస్, గాయాల విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకుంది. ఇకపోతే భారత్ ఈ సిరీస్లో మహమ్మద్ షమీని కూడా ప్రయోగించాలని చూసింది. అయితే అతను కరోనా బారిన పడడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక అతని స్థానంలో ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఆరేళ్ల క్రితం మొహాలీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరిసారి మ్యాచ్ జరిగింది. ఇకపోతే భారత జట్టు జూన్ 2022 తర్వాత మొదటిసారిగా స్వదేశంలో సిరీస్ ఆడబోతుంది. దీంతో ఈ సిరీస్ పట్ల అభిమానుల్లో తెగ ఆసక్తి నెలకొంది. ఇటీవల మొహాలీ స్టేడియంలో ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగకపోవడంతో పిచ్ విషయంలో ఇరు జట్లకు కాస్త కొత్తదనమే ఎదురవ్వొచ్చు.

ఆ వెబ్ సైట్ ప్రకారం..
మొహాలీలో నేడు జరగబోయే మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచనలు లేవు. దీంతో ఆట సజావుగా సాగే అవకాశముంది. పంజాబ్ వాతావరణ విభాగం కూడా ఈ విషయమై సానుకూల ప్రకటన చేసింది. ఇక ప్రముఖ వెబ్ సైట్ weather.com ప్రకారం ఉష్ణోగ్రత 27-29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. మొహాలీలో తేమ మ్యాచ్ వ్యవధిలో 75-80%గా ఉంటుందని అంచనా. ఈ మైదానంలో అవుట్‌ఫీల్డ్ కాస్త బ్యాటర్లకు డిసడ్వంటేజీ కావొచ్చు. బౌలర్లకు కూడా పిచ్ రీడ్ చేయడం కాస్త సవాలుగానే ఉంటుంది. బౌండరీలు ఎక్కువ దూరంలో ఉండడం కాస్త ఫీల్డర్లకు కలిసొస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు లాభపడవచ్చు.

ఆస్ట్రేలియాతో మూడో టీ20కి బరిలో దిగే భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications