
హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్, ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కి కూడా వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఒకటి. అలాగే భారత్-పాక్ మ్యాచ్ మధ్యలో కూడా వర్షం కురిసింది.
టీమిండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసి డక్‌వర్త్ లుయీస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో ఓడింది. టోర్నీలో భాగంగా టీమిండియా శనివారం పసికూన ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో వర్షాలు పడుతున్నాయి.
గురువారం టీమిండియా నెట్ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత స్టేడియంలో వర్షం కురిసింది. దీంతో ఆప్ఘనిస్థాన్ జట్టు నెట్ ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. అయితే, శుక్రవారం మాత్రం ఎలాంటి వర్షసూచన లేకపోవడంతో ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి.
మోరవైపు ఇంగ్లాండ్‌లో ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించలేమని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం విశేషం. టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసే మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన గెలిస్తే సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
అలా కాకుండా ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో ఈ ప్రభావం టీమిండియా తప్పక చూపిస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం వర్షం కురవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.