Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుభవం Vs ఆత్మ విశ్వాసం: బెంగళూరులో చారిత్రాత్మక టెస్టు

India vs Afghanistan Preview: A battle of experience vs self-confidence

హైదరాబాద్: భారత్-ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. టెస్టు హోదా పొందిన తర్వాత ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టు మ్యాచ్‌ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రహానే నాయకత్వంలోని టీమిండియాతో తలపడనుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ గురువారం(జూన్ 14) నుంచి ప్రారంభం కానుంది.

అస్గర్ సారథ్యంలోని ఆప్ఘనిస్థాన్ జట్టు ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న టీమిండియాతో తలపడుతుండటంతో ఈ టెస్టుపై ఎంతో ఆసక్తి నెలకొన్నది. మెడ గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏకైక టెస్టు నుంచి తప్పుకోవడంతో ఆతడి స్థానంలో వైస్ కెప్టెన్ రహానే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

ఆప్ఘనిస్థాన్ దేశానికి జూన్ 14 మరిచిపోలేని రోజు. టెస్టు క్రికెట్‌లో కనీస ఓనమాలు కూడా తెలియని ఆ జట్టు, ఏకంగా టెస్టు ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాతో తలపడనుంది. ప్రపంచం మొత్తం రష్యా వైపు చూస్తుంటే, ఆప్ఘన్ జట్టు మాత్రం టెస్టు క్రికెట్‌లో టీమిండియాపై విజయం సాధించి చరిత్ర సృష్టించాలని చూస్తోంది.

ఫేవరేట్‌గా టీమిండియా

ఫేవరేట్‌గా టీమిండియా

ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఈ ఏకైక టెస్టులో టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటన, ఐపీఎల్‌ అనంతరం మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న భారత్‌కు ఈ టెస్టు మ్యాచ్‌ పెద్ద సవాలేమీ కాదు. అయితే, గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్న రహానే జట్టును ఏవిధంగా ముందుండి నడిపిస్తాడో చూడాలి.

కెప్టెన్‌గా రహానే

కెప్టెన్‌గా రహానే

గతంలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత పర్యటనకు వచ్చిన సమయంలో రహానే కెప్టెన్సీలో టీమిండియా ఓ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోవైపు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌తో కలిసి చక్కటి శుభారంభం ఇస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు తిరుగుండదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సహచర ఆటగాడు రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ధావన్‌ ఎలా ఆడతాన్నదే ఆసక్తికరంగా ఉంది.

భారత్‌కు భారీ ఆధిక్యం లభిస్తుందా?

భారత్‌కు భారీ ఆధిక్యం లభిస్తుందా?

ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఓ కార్యక్రమంలో ధావన్ మాట్లాడుతూ రషీద్‌ బౌలింగ్‌ని ధాటిగా ఎదుర్కొంటానంటూ అన్నాడు. ఆ తర్వాత ఛతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడితే భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో ఆల్ రౌండర్ హర్ధిక్‌ పాండ్యా, వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నారు.

భువీ, బుమ్రాలకు విశ్రాంతి

భువీ, బుమ్రాలకు విశ్రాంతి

ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్‌ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. దీంతో ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ పేస్‌ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. ఐపీఎల్‌లో ఉమేశ్‌ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.. ఇషాంత్‌ శర్మతో పాటు ఇక, స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ప్రత్యర్ధి జట్టుపై ఎలాంటి బంతులు విసురుతారో చూడాలి.

అందరి కళ్లు రషీద్‌ ఖాన్‌పైనే

అందరి కళ్లు రషీద్‌ ఖాన్‌పైనే

ఇక, ఆప్ఘనిస్థాన్ విషయానికి వస్తే అరంగ్రేట మ్యాచ్‌ అయినప్పటికీ, సత్తా చాటాలాని ఊవిళ్లూరుతోంది. ఆప్ఘనిస్థాన్ జట్టుకు ప్రధాన బలం బౌలింగే. ఇటీవల ఐపీఎల్‌, బంగ్లాదేశ్‌ సిరీస్‌లో మెరిసి ఒక్కసారిగా క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న యువ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌పైనే అందరిదృష్టి ఇప్పుడు నెలకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సంచలనాలు సృష్టించిన రషీద్ ఖాన్ ఐదు రోజుల ఫార్మాట్‌లో ఎలా రాణిస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఆత్మ విశ్వాసంతో ఆప్ఘనిస్థాన్ జట్టు

ఆత్మ విశ్వాసంతో ఆప్ఘనిస్థాన్ జట్టు

అతనితోపాటు ముజీబ్‌, మహ్మాద్‌ నబీ కూడా చెలరేగితే భారత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేసే అవకాశం లేకపోలేదు. ఇక, బ్యాటింగ్‌ విషయానికొస్తే.. కెప్టెన్‌ ఆస్గర్‌‌ ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతనికితోడుగా వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ మహమ్మద్‌ షాహజాద్‌ కూడా ఫామ్‌లో ఉన్నారు. వీరితోపాటు జట్టులోని మిగతా ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తే ఆప్ఘనిస్థాన్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Story first published: Wednesday, June 13, 2018, 18:24 [IST]
Other articles published on Jun 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+