Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ స్థానంలో నాయర్: ఇంగ్లాండ్ పర్యటనకి భారత జట్టు ప్రకటన

India vs Afghanistan: Karun Nair replaces Virat Kohli in Test squad; Iyer in ODI team for England

హైదరాబాద్: జూన్ నెలలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌తోపాటు ఐర్లాండ్ టీ20 సిరీస్, ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్‌లకు మంగళవారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ టీమిండియాను ఎంపిక చేసింది. ఆఫ్ఘన్‌తో జరగబోయే ఏకైక టెస్టుకు కోహ్లీ దూరం కావడంతో రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు టెస్టు జట్టులోకి విరాట్ కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్‌ను తీసుకున్నారు. ఐర్లాండ్‌తో జ‌రిగే రెండు టీ20ల సిరీస్‌కు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం అంబటి రాయుడుకు జట్టులో చోటు దక్కింది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లీ దూరంగా ఉండ‌నున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ కౌంటీల్లో ఆడాల‌ని నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ నెల మొత్తం కోహ్లి కౌంటీ క్రికెట్‌లో స‌ర్రే జట్టుకు ఆడ‌నున్నాడు.

జూన్ 14 నుంచి బెంగ‌ళూరులో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే కౌంటీల్లో ఆడుతున్న ఇషాంత్, పుజారా తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం రాయుడుతోపాటు శ్రేయాస్ అయ్యర్, సిద్దార్థ్ కౌల్‌లకు జట్టులో చోటు కల్పించారు.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో తలపడే టీమిండియా:
అజింక్య రహానే(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్ధూల్ ఠాకూర్.

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌‌లో తలపడే టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌కి టీమిండియా:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, చాహల్; కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కి టీమిండియా:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

Story first published: Tuesday, May 8, 2018, 19:10 [IST]
Other articles published on May 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+