For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌Xఅఫ్గన్: ధోనీ జట్టుతో 'టై'గా ముగించిన అఫ్గాన్ జట్టు

ASIA CUP 2018 : India vs Afghanistan : Super Four Match Ends With A Tie Score Of 252
India vs Afghanistan: India-Afghanistan Asia Cup match ends in a thrilling tie

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో భారత్‌కు ఊహించని ఫలితం. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం ఖాయం అనుకున్నా.. మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది. రాయుడు, రాహుల్‌ మెరిసినా 253 పరుగుల ఛేదనలో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌కు రాహుల్‌, రాయుడు మెరుపు ఆరంభాన్నిచ్చారు.

 కీలక సమయంలో కార్తీక్‌ ఔట్‌, చివరికి మ్యాచ్‌ టై

కీలక సమయంలో కార్తీక్‌ ఔట్‌, చివరికి మ్యాచ్‌ టై

ఓపెనర్‌గా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన రాయుడు సిక్స్‌లతో చెలరేగాడు. రాహుల్‌ 55 బంతుల్లో అర్ధసెంచరీ సాధిస్తే.. రాయుడు 43 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే జోరులో మరో భారీ షాట్‌కు వెళ్లిన రాయుడు క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. కాసేపటికే రాహుల్‌ కూడా అతణ్ని అనుసరించాడు. వీళ్లిద్దరూ ఔటయ్యాక భారత రన్‌రేట్‌ తగ్గింది. దీనికి తోడు ధోని (8), పాండే (8), జాదవ్‌ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కీలక సమయంలో కార్తీక్‌ (44) ఔట్‌ కావడంలో ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి మ్యాచ్‌ టై అయింది.

ఓపెనర్‌ షెజాద్‌ బ్యాటింగే హైలైట్‌

ఓపెనర్‌ షెజాద్‌ బ్యాటింగే హైలైట్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ షెజాద్‌ బ్యాటింగే హైలైట్‌. ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అతడు 37 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. 12 ఓవర్లకు అఫ్గాన్‌ 65/0తో నిలిస్తే.. అందులో షెజాద్‌ స్కోరే 56 పరుగులు ఉందంటే అతనెంత ధాటిగా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ స్థితిలో స్పిన్నర్లు రంగప్రవేశం చేయడంలో అఫ్గాన్‌ వరుస వికెట్లు కోల్పోయింది.

ఆఖర్లో నబి చెలరేగడంతో మెరుగైన స్కోరు

ఆఖర్లో నబి చెలరేగడంతో మెరుగైన స్కోరు

జడేజా బౌలింగ్‌లో ధోని చేసిన మెరుపు స్టంపింగ్‌తో అహ్మది (5) పెవిలియన్‌ చేరగా.. రహ్మత్‌ షా (3).. జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. హస్మతుల్లా (0), అస్గర్‌ (0)లను కుల్‌దీప్‌ వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో అఫ్గాన్‌ 82/4తో కష్టాల్లో పడింది. వికెట్లు పడినా షెజాద్‌ మాత్రం ఆగలేదు. వీలుచిక్కినప్పుడల్లా భారీషాట్లు కొట్టిన అతను.. 88 బంతుల్లో వన్డేల్లో ఐదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న షెజాద్‌ను జాదవ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే ఆఖర్లో నబి (64) చెలరేగడంతో అఫ్గాన్‌ మెరుగైన స్కోరు సాధించింది.

ఐదు మార్పులతో బరిలోకి భారత్‌

ఐదు మార్పులతో బరిలోకి భారత్‌

మ్యాచ్‌లో భారత్‌ ఐదు మార్పులు చేసింది. రోహిత్‌, ధావన్‌, చాహల్‌, భువనేశ్వర్‌, బుమ్రా స్థానంలో చాహర్‌, రాహుల్‌, పాండే, ఖలీల్‌, కౌల్‌ జట్టులోకొచ్చారు. విధిరాతను తాను నమ్ముతానంటున్నాడు మహేంద్రసింగ్‌ ధోని. లేకపోతే 200వ వన్డేకు కెప్టెన్సీ చేసే అవకాశం ఎందుకు వస్తుందని అంటున్నాడు. మంగళవారం అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకోవడంతో అనుకోకుండా ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. గత ఏడాది ఆరంభంలో ధోని వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

విధిరాతంటే ఇదేనేమో.

విధిరాతంటే ఇదేనేమో.

‘విధిరాతంటే ఇదేనేమో. 199 వన్డేలకు కెప్టెన్‌గా చేశాను. ఈ మ్యాచ్‌తో 200 పూర్తి చేస్తున్నా. అందుకే విధిరాతను నమ్ముతాను. రెండొందలు పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని ధోని చెప్పాడు. విశేషం ఏంటంటే.. కెప్టెన్‌గా ధోనికిది 200వ వన్డే. రికీ పాంటింగ్‌ (230), ఫ్లెమింగ్‌ (218) మాత్రమే ఈ మైలురాయిని దాటారు.

1
44056
Story first published: Wednesday, September 26, 2018, 12:29 [IST]
Other articles published on Sep 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+