Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుభవం ఉంది: రషీద్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న విజయ్ శంకర్

India vs Afghanistan, ICC World Cup 2019: Vijay Shankar ready to counter threat of Rashid Khan

హైదరాబాద్: ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్‌ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తెలిపాడు. ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. టోర్నీలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో పసికూన ఆప్ఘనిస్థాన్‌తో కోహ్లీసేనతో తలపడనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ మాట్లాడుతూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రషీద్‌ఖాన్‌ ప్రపంచశ్రేణి బౌలరని కొనియాడాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కలిసి ఆడిన అనుభవం ఉన్నందున రషీద్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటానని చెప్పాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి బౌలింగ్‌లో అనేక వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేవాడినని తెలిపాడు.

కాగా, ఆప్ఘన్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో విజయ్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, గాయం పెద్దదేమీ కాదని, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ఆప్ఘన్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయ్ శంకర్ బరిలోకి దిగనున్నాడు.

ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో పేస్‌ బలమున్న ప్రత్యర్థులపై నెగ్గుతూ వచ్చిన టీమిండియా, ఇప్పుడు స్పిన్‌ ప్రధాన అస్త్రమైన జట్టును ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ రేసులో మరింత ముందుకెళ్తుంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు ఆ అంచనాలను అందుకోలేకపోయింది.

ఆప్ఘన్ బౌలర్‌ రషీద్‌ఖాన్‌పై ప్రపంచకప్‌కు ముందు ఎన్నో అంచనాలు ఉండేవి. అయితే, ఈ టోర్నీలో ఆ స్థాయి మేరకు రాణించలేకపోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 9 ఓవర్లలోనే ఏకంగా 110 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

Story first published: Saturday, June 22, 2019, 13:13 [IST]
Other articles published on Jun 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+