For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టు: వింత రికార్డు నెలకొల్పిన దినేశ్ కార్తీక్

By Nageshwara Rao
India vs Afghanistan: Dinesh karthik come back after 87 test matches

హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఓ వింత రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్ చివరి టెస్టుకి ఆప్ఘన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కి మధ్యలో మొత్తం 87 టెస్టులకు దూరమయ్యాడు.

దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల మధ్యలో అత్యధిక టెస్టులకు దూరమైన భారత ఆటగాడిగా దినేశ్ కార్తీక్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థీవ్ పటేల్ పేరిట ఉంది. పార్దీవ్ పటేల్ రెండు టెస్టుల మధ్యలో మొత్తం 83 టెస్టులకు దూరమయ్యాడు.

ఇదిలా ఉంటే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా (10), అశ్విన్ (7) పరుగులతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు ఇద్దరూ శిఖర్ ధావన్ (107), మురళీ విజయ్ (105) సెంచరీలతో చెలరేగగా... కేఎల్ రాహుల్ (54) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 107 పరుగులు చేసిన ధావన్ అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆనంతరం మురళీ విజయ్ దూకుడుగా ఆడి 153 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 105 పరుగులు చేశాడు. ఈ సమయంలో వఫాదార్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 280 పరుగుల వద్ద ఎల్బీగా ఔటయ్యాడు.

ఆ వెంటనే లోకేశ్ రాహుల్(54) అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా(35), కెప్టెన్ అజింక్యా రహానే(10), దినేశ్ కార్తీక్(4) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. అఫ్ఘానిస్థాన్ బౌలింగ్‌లో అహ్మద్‌జాయ్ 2, వఫాదార్, రషీద్, ముజీబ్ తలో వికెట్ తీశారు.

Story first published: Thursday, June 14, 2018, 19:22 [IST]
Other articles published on Jun 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+