టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్‌లో సునాయసంగా విజయాలతో హోరెత్తించిన భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్థాన్‌తో గురువారం బార్బడోస్ వేదికగా సూపర్-8లో తలపడనుంది. గ్రూప్-1లో భారత్, అఫ్గానిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఉన్నాయి. కాగా, అఫ్గాన్‌తో మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో చెమటోడుస్తున్నారు.
లీగ్ మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి మరోసారి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌తో పాటు బ్యాకప్ పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో సాధన చేశాడు. స్పిన్‌లో సమర్థవంతంగా కోహ్లి షాట్లు ఆడాడు. ఎక్కువ బంతులు బ్యాట్‌కు మిడిల్‌లో తాకాయి. అయితే ఖలీల్ బౌలింగ్‌లో విరాట్ కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ సంధించిన బంతులను జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు.

కాగా, కీలక పోరులో ప్రతి క్యాచ్, ఒక్క పరుగు ఎంతో కీలకం. దీంతో భారత ఆటగాళ్లతో ఫీల్డింగ్ డ్రిల్స్‌ను కోచింగ్ స్టాఫ్ ఎక్కువసేపు చేపించింది. ఈ క్రమంలో స్టార్ ఫాస్ట్ బౌలర్ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. గాల్లోకి ఎగురుతూ బంతిని ఒడిసిపట్టాడు. అనంతరం బుమ్రా ఫీల్డింగ్ నైపుణ్యాన్ని సహచర ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, చాహల్ అభినందించారు. హార్దిక్ ప్రత్యేకంగా బుమ్రాను హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
కాగా, బలబలాల పరంగా, గత రికార్డుల దృష్ట్యా అఫ్గానిస్థాన్ భారత్‌దే పైచేయి. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో టీమిండియా ఏడు విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ రద్దైంది. ఈ ఏడాది ఆరంభంలో ఆడిన టీ20 సిరీస్‌ను 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. రేపటి మ్యాచ్‌లో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. గేమ్ ఛేంజర్ కుల్‌దీప్ యాదవ్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.ఈ వరల్డ్ కప్‌లో కుల్‌దీప్ బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.