

హైదరాబాద్: ఆసియాకప్ సూపర్-4లో భాగంగా భారత్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ అస్గర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
ఆశ్చర్యంగా టాస్‌కు రోహిత్ శర్మ స్థానంలో ఎంఎస్ ధోనీ వచ్చాడు. దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తుండటం విశేషం. కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత దాదాపు రెండేళ్లకు మరోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ పర్యటనకు వచ్చిన 15 మందికీ భారత జట్టులో స్థానం ఉండాలన్నదే తమ ఉద్దేశమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌తో బౌలర్ దీపక్ చాహర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. వారి స్థానాల్లో లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే, దీపక్ చాహర్, సిద్ధార్థ కౌల్, ఖలీల్ అహ్మద్‌లు తుది జట్టులోకి వచ్చారు.
టోర్నీలో జైత్రయాత్ర సాగిస్తున్న భారత జట్టు ఇప్పటికే దాదాపు ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకోగా.. సూపర్-4లో వరుసగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ చేతిలో ఓడిన అఫ్గానిస్థాన్ టీమ్ ఫైనల్ ఆశలు వదులుకుంది. దీంతో ఈ మ్యాచ్ ఆప్ఘన్ జట్టుకి నామమాత్రమే అయినప్పటికీ.. ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశముంది.
మరోవైపు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్‌కి చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. టోర్నీలో అఫ్ఘన్‌కు ఇదే చివరి మ్యాచ్‌కాగా, ఫైనల్ రేసులో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
జట్ల వివరాలు
భారత్ తుది జట్టు:
లోకేశ్ రాహుల్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్/ కెప్టెన్), దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, సిద్ధార్థ కౌల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.