Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకున్న టీమిండియా..!!

Team India captain Rohit Sharma is likely to bring back Dinesh Karthik and Deepak Chahar into the fold following India’s back-to-back losses in the Super 4s stage.

దుబాయ్: చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకున్నారనే సామెత.. ఇప్పుడున్న భారత క్రికెట్ జట్టుకు అతికినట్టు సరిపోతుంది. గ్రూప్ దశలో పులి.. సూపర్ 4లో పిల్లిలా తయారైంది టీమ్.

వరుసగా రెండు విజయాలతో గ్రూప్ దశలో టాప్ నిలిచిన జట్టు- మలి రౌండ్‌కు వచ్చేసరికి ఘోరంగా చతికిల పడుతుందని ఎవరూ ఊహించివుండరు. పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓటమితో ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2022 నుంచి దాదాపుగా వైదొలగింది.

ఆఫ్ఘన్‌తో..

ఆఫ్ఘన్‌తో..

సూపర్ 4లో ఇవ్వాళ తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం- ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లు దాదాపుగా టోర్నమెంట్ నుంచి వైదొలగినట్టే. టీమిండియాకు స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయి గానీ అలాంటి అద్భుతాలు వాస్తవ రూపాన్ని దాల్చడం సాధ్యపడకపోవచ్చు.

వికటించిన ప్రయోగాలు..

వికటించిన ప్రయోగాలు..

సూపర్ 4 దశలో తొలి రెండు మ్యాచ్‌లల్లో చేసిన ప్రయోగాలు దారుణంగా వికటించాయి. చేదు ఫలితాలను అందించాయి. మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తరువాత ఆ స్థాయిలో అందుబాటులో ఉన్న బ్యాటర్లల్లో ది బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను పక్కన పెట్టింది టీమిండియా. అతని స్థానంలో రిషభ్ పంత్‌‌ను తుదిజట్టులో చోటు కల్పించింది. ఆశించిన ఫలితం రాలేదు. దీపక్ హుడా కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు.

చేజార్చుకున్న ఆ ఇద్దరూ..

చేజార్చుకున్న ఆ ఇద్దరూ..

ఈ పరిణామాల శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. అనవసరంగా రివర్స్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీపక్ హుడాదీ అదే పరిస్థితి. మూడు పరుగులకే మదుషనక బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ముందు- ఆసియా కప్ 2022 రూపంలో అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను వారిద్దరూ జారవిడుచుకున్నట్టే అయింది. ఒక్క విన్నింగ్ నాక్ ఆడివున్నా పరిస్థితి మరోలా ఉండేది.

దినేష్, దీపక్‌

దినేష్, దీపక్‌

ఇవ్వాళ జరిగే మ్యాచ్‌లో రిషభ్ పంత్, దీపక్ హుడాను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టడానికే అవకాశాలు ఉన్నాయి. రిషభ్ పంత్ స్థానంలో దినేష్ కార్తీక్ తీసుకోవచ్చు. హుడా స్థానంలో దీపక్ చాహర్‌‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు. తుదిజట్టులో ఈ రెండు మార్పులతో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌పై బరిలోకి దిగుతుందనే అంచనాలు ఉన్నాయి. దినేష్ కార్తీక్‌ను తీసుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ మాజీ ప్లేయర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అతను రాణించగలిగితే- టీ20 ప్రపంచకప్‌కు ఢోకా లేనట్టే.

తుదిజట్టులో

తుదిజట్టులో

టీమిండియా తుదిజట్టు ప్రాబబుల్స్‌లో- కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ లేదా యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆఫ్ఘన్ టీమ్‌లో- హజ్రతుల్లా జజై, రహ్మనుల్లా గుర్బాన్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జడ్రాన్, నజీబుల్లా జడ్రాన్, మహ్మద్ నబీ (కేప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నవీనుల్ హక్, ముజీబుర్ రెహ్మాన్, ఫజల్ హర్ ఫారూఖీ ఆడొచ్చు.

Story first published: Thursday, September 8, 2022, 7:09 [IST]
Other articles published on Sep 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+