For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్రీడమ్ సిరీస్ హైలెట్స్: గొప్ప, చెత్త రికార్డులివే

By Nageswara Rao

న్యూఢిల్లీ: ఫ్రీడమ్ సిరిస్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న తొలి కెప్టెన్ విరాట్ కోహ్లీనే.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 337 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మొహాలిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వర్షం కారణంగా బెంగుళూరులో జరిగిన రెండో టెస్టు నిలిపివేశారు. నాగ్ పూర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించడంతో 9 సంవత్సరాల పాటు తిరుగులేకుండా సాధించిన జట్టు విజయాల రికార్డుని చెరిపివేసింది. దక్షిణాఫ్రికా జట్టు ఆడిన గత 15 సిరిస్‌లలో ఓటమిని చవి చూడలేదు.

India and Virat Kohli create history at Kotla as they thrash SA by 337 runs

ఫ్రీడమ్ సిరిస్‌లో గొప్ప అత్యంత చెత్త రికార్డులివే:

* ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన 5వ భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కన్నా ముందు విజయ్ హజారే, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలు మాత్రమే ఈ ఘనతను సాధించారు.
* ఓ టెస్టులో 5వ నంబర్ కన్నా దిగువన బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు రహానే. అంతకుముందు 2008 అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్ 259 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించడంతో పాటు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, రహానే 227 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు.
* ఈ సిరీస్‌లో బెస్ట్ ఎకానమీ బౌలర్‌గా వరల్డ్ నంబర్ 2 స్థానంలో జడేజా నిలిచాడు. సౌతాఫ్రికా పై 46 ఓవర్లు వేసిన జడేజా కేవలం 26 పరుగులే ఇచ్చాడు. అతని కన్నా ముందు 1964లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 32 ఓవర్లు వేసిన నద్ కర్ణీ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
* ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక మెయిడెన్లు వేసిన టాప్-10 జాబితాలో జడేజా చేరిపోయాడు. 46 ఓవర్లు వేసిన జడేజా వాటిల్లో 33 మెయిడెన్లు వేయడం గమనార్హం.
* కనీసం 200 బంతులాడిన ఆటగాళ్లలో అతి తక్కువ స్ట్రయిక్ రేటును హసీమ్ ఆమ్లా సాధించి ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 244 బంతులాడిన ఆమ్లా చేసింది 25 పరుగులే. అతని తరువాత ఇంగ్లండ్ ఆటగాడు రసెల్స్ ఉండగా, మూడవ స్థానంలో నేడు అత్యంత జిడ్డు ఆట చూపిన డివిలియర్స్ నిలిచాడు.
* ఓ టెస్టు మ్యాచ్ లో తొలి 50 ఓవర్లకు దక్షిణాఫ్రికా చేసిన 49 పరుగులే అత్యల్పం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2005లో జరిగిన ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ స్కోరు 68 పరుగులు.
* దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన మ్యాచ్‌లలో నాలుగో ఇన్నింగ్స్‌కు అత్యధిక పలుగుల టార్గెట్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని 481 పరుగులు.
* ఇక అత్యధిక సేపు ఆడి అతి తక్కువ పార్ట్ నర్ షిప్‌లో తొలి మూడు రికార్డులూ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నమోదు చేసింది.

India and Virat Kohli create history at Kotla as they thrash SA by 337 runs

All India-South Africa Test series results (as on December 7, 2015)
Total series played - 12 (South Africa won 6; India won 3; Drawn 3)
1992-93 - At home, South Africa beat India 1-0 (4-match series)
1996-97 - India won 2-1 (3) at home
1996-97 - Hosts SA won 2-0 (3)
1999-2000 - SA won 2-0 (2) in India
2001-02 - SA won 1-0 (2) at home
2004-05 - Hosts India won 1-0 (2)
2006-07 - Hosts SA won 2-1 (3)
2007-08 - Drawn 1-1 (3) in India
2009-10 - Drawn 1-1 (2) in India
2010-11 - Drawn 1-1 (3) in SA
2013-14 - SA won 1-0 (2) at home
2015-16 - Hosts India won 3-0 (4)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+